Kedar Selagamsetty Dies : నిర్మాత కేదార్ మృతితో తలలు పట్టుకున్న టాప్ హీరోలు
Kedar Selagamsetty Dies : ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు నిర్వహించిన కేదార్, టాలీవుడ్ ప్రముఖులకు బినామీగా వ్యవహరిస్తూ వ్యాపారాలను విస్తరించారని తెలుస్తోంది
- By Sudheer Published Date - 11:59 AM, Thu - 27 February 25

ప్రముఖ నిర్మాత మరియు వ్యాపారవేత్త కేదార్ శెలగంశెట్టి (Kedar Selagamsetty) ఆకస్మిక మరణం టాలీవుడ్‌ను తీవ్రంగా కుదిపేసింది. కేదార్ వ్యాపారాలలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్రహీరోలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు నిర్వహించిన కేదార్, టాలీవుడ్ ప్రముఖులకు బినామీగా వ్యవహరిస్తూ వ్యాపారాలను విస్తరించారని తెలుస్తోంది. ఇప్పుడు అతని ఆకస్మిక మరణం ఆయా హీరోలు, సినీ ప్రముఖుల్లో తీవ్రమైన అనిశ్చితిని నెలకొల్పింది. తమ పెట్టుబడులు ఏ వ్యాపారాల్లో ఉన్నాయనే పూర్తి సమాచారం వారికీ తెలియకపోవడంతో టెన్షన్ నెలకొంది.
MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం
ఇప్పటికే కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో బయటపడిన డ్రగ్స్ కేసులో కేదార్ పేరు వినిపించింది. ఆ తర్వాత దుబాయ్‌లో అతను పెద్ద స్థాయిలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం సాగింది. అతను ఓ ప్రముఖ ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కీలక వాటాదారుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేదార్ తన ఆధ్వర్యంలో పలు ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ కంపెనీలను నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు అతని ద్వారా భారీ పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఇప్పుడాయన మరణంతో, తమ పెట్టుబడుల భద్రత ఏమిటనే ప్రశ్న సినీ ప్రముఖులు, రాజకీయ నేతల్ని వేధిస్తోంది.
Lucky Baskhar: ఓటీటీలో దుమ్ము దులుపుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. ఏకంగా 13 వారాల నుంచి ట్రెండింగ్!
కేదార్ అకస్మాత్తుగా మృతి చెందడంతో అతని ఆధ్వర్యంలో నడిచిన వ్యాపారాలు, పెట్టుబడులు ఏమయ్యాయి అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అతనిపై భారీగా పెట్టుబడి పెట్టిన అగ్రహీరోలు, నిర్మాతలు ఇప్పుడు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. పెట్టుబడులు పెట్టిన డబ్బును ఎలా తిరిగి పొందాలో కూడా వారికి స్పష్టత లేకపోవడం గుబులుగా మారింది. సినీ ఇండస్ట్రీలోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.