Tollywood Stars : టాలీవుడ్ స్టార్స్ చిల్ మూమెంట్.. అభిమాన తారలు ఒకేచోట ఇలా..!
Tollywood Stars స్టార్స్ అంతా తమ ఇమేజ్ ని పక్కన పెట్టి చిల్ అవ్వడం ఫ్యాన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో నమ్రత, ఉపాసన కూడా ఉండటం విశేషం
- Author : Ramesh
Date : 08-11-2024 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
Tollywood Stars తెలుగు స్టార్స్ అంతా కూడా ఒకచోట పార్టీ మూడ్ లో ఉన్నారు. టాలీవుడ్ బడా స్టార్స్ అయిన చిరంజీవి (Chiranjeevi), నాగార్జున(Nagarjuna)తో పాటుగా మహేష్, రాం చరణ్, అఖి ఇలా అందరు చిల్ అవుతూ కనిపించారు. మాల్దీవుల్లో ఒక బిజినెస్ మ్యాన్ బర్త్ డే వేడుకల్లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తుండగా ఈ పార్టీలో భాగంగా తెలుగు స్టార్స్ అంతా కూడా రిలాక్స్ మోడ్ లో కనిపించారు.
చిరంజీవి, నాగార్జునతో పాటు సూపర్ స్టార్ మహేష్ (Mahesh), గ్లోబల్ స్టార్ రాం చరణ్, అఖిల్ కూడా ఈ పార్టీలో పాల్గొనడం విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బయటకు వచ్చిన ఈ ఫోటో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇలా స్టార్స్ అంతా తమ ఇమేజ్ ని పక్కన పెట్టి చిల్ అవ్వడం ఫ్యాన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో నమ్రత, ఉపాసన కూడా ఉండటం విశేషం.
మేమంతా ఒక్కటే అనిపించేలా..
సినిమాల పరంగా తామెంత పోటీ పడ్డా కూడా మేమంతా ఒక్కటే అనిపించేలా స్టార్స్ పార్టీ మూడ్ ఉంటుంది. ముఖ్యంగా మాల్దీవుల్లో జరిగిన ఈ లేటెస్ట్ పార్టీకి సంబందించిన ఈ ఫోటో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. టాలీవుడ్ స్టార్స్ ఇలా ప్రత్యేకమైన పార్టీ చేసుకోవడం చాలా అరుదు.
ఇక సినిమా విషయానికి వస్తే చిరంజీవి విశ్వంభర, నాగార్జున కుబేర, కూలీ, చరణ్ గేం చేంజర్ సినిమాలు చేస్తున్నారు. అఖిల్, మహేష్ లు తమ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.
Also Read : YCP Counter : పవన్ కళ్యాణ్ కు వైసీపీ మాములు కౌంటర్ ఇవ్వలేదుగా..!!