YCP Counter : పవన్ కళ్యాణ్ కు వైసీపీ మాములు కౌంటర్ ఇవ్వలేదుగా..!!
YCP Counter : 'మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు
- By Sudheer Published Date - 12:34 PM, Fri - 8 November 24

వాలంటీర్లు వ్యవస్థ (Volunteers System)లోనే లేరని, జీవోల్లో వారి ప్రస్తావన లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు YCP కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన జీవోలు, వారి నియామక, జీతాల ఉత్తర్వులను Xలో పోస్టు చేసింది. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేసింది.
వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని, జీవోల్లో వారి ప్రస్తావనే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం పై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసి నియమించుకుందని ఆరోపించారు. వైసీపీ జారీ చేసిన జీవోలో వాలంటీర్లను అధికారికంగా గుర్తించినట్లు ఎక్కడ లేదని, రికార్డుల్లో కూడా వాలంటీరు ఉద్యోగాలేవీ లేవని పవన్ కల్యాణ్ తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థపై సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వారి ఉద్యోగ స్థితిని గత ప్రభుత్వం జీవోలో చట్టబద్ధంగా ఏర్పాటు చేయలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసింది.
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన జీవోలు, వారి నియామక, జీతాల ఉత్తర్వులను Xలో పోస్టు చేసింది. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేసింది.
.@PawanKalyan మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు.
వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే
మీ అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు. pic.twitter.com/7vRU4Bppaq— YSR Congress Party (@YSRCParty) November 7, 2024
Read Also : Cyber Crime : సమగ్ర కుటుంబ సర్వే ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు..