HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Producer Suryadevara Naga Vamsi Commets Mad Square

Suryadevara Naga Vamsi: అందుకోసం మాత్రమే థియేటర్ కు రండి.. లాజిక్స్ వెతకొద్దు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగవంశీ

తాజాగా మాడ్ స్క్వేర్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత సూర్యదేవర నాగే వంశీ మాట్లాడుతూ సినిమాలో లాజిక్స్ వెతకొద్దు అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Author : Anshu Date : 01-03-2025 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suryadevara Naga Vamsi
Suryadevara Naga Vamsi

సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ మ్యాడ్‌ స్క్వేర్. ఇప్పటికే గతంలో విడుదల అయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యాడ్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కు సినిమా కూడా అంతకుమించి ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

కాగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. మ్యాడ్‌ మూవీలాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్‌ స్క్వేర్.

ఈ సారి హైదరాబాద్‌ లో చేసిన అరాచకాలు అయిపోయాయి. స్టోరీని గోవాకు మార్చాము. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు. ముందే క్లియర్‌ గా చెబుతున్నాను. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా నాగ వంశీ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గతంలో విడుదల అయిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ సినిమాకు వస్తున్న స్పందనాన్ని బట్టి చూస్తే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని తెలుస్తోంది. టీజర్‌ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Naga Vamsi
  • Producer Naga Vamsi
  • Suryadevara Naga Vamsi
  • tollywood

Related News

Mehreen Pirzada

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

  • Ss Thaman

    ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • Jetlee

    Jetlee: జెట్లైలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. రియా సింఘా ఎంట్రీ!

Latest News

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd