Tollywood: భార్య గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్.. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనంటూ!
తాజాగా టాలీవుడ్ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి తన సోషల్ మీడియా వేదిక భార్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
- By Anshu Published Date - 10:03 AM, Mon - 10 March 25

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్, జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచ్చ రవి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించారు. ఇకపోతే ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా తన పెళ్లి రోజు సందర్బంగా భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరు దివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో ఈ విదంగా రాసుకొచ్చారు. నిన్ను పరిచయం చేసిన నీ.. నా.. తల్లిదండ్రుల రుణం తీరదు.
నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ.. కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.. ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని.. అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.. నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని.. నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.