Box Office : సినీ లవర్స్ కు ఈ వారం పండగే పండగ
Box Office : ఈ వారం సినీ లవర్స్ ను అలరించేందుకు వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. కేవలం వెండితెరపై మాత్రమే కాదు OTT లలో కూడా పెద్ద, చిన్న సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి
- By Sudheer Published Date - 12:29 PM, Mon - 24 March 25

సినీ లవర్స్ (Movie Lovers) కు ఈ వారం పండగే పండగ. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు గత కొద్దీ రోజులుగా పెద్ద సినిమాలు లేకపోవడం , వారానికి రెండు మూడు సినిమాలు వస్తున్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం నాని నిర్మించిన కోర్ట్ (Court) మూవీ నే రెండు వారాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది తప్ప మరోటి లేదు. ఈ క్రమంలో ఈ వారం సినీ లవర్స్ ను అలరించేందుకు వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. కేవలం వెండితెరపై మాత్రమే కాదు OTT లలో కూడా పెద్ద, చిన్న సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. మరి అవి ఏంటో చూద్దాం.
10th Paper Leak: ఆరుగురు అరెస్ట్!
మార్చి 27న మోహన్లాల్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ కూడా అదే రోజున థియేటర్లలో సందడి చేయనుంది. మరుసటి రోజు అనగా మార్చి 28న నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటికి తోడు మార్చి 30న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ
ఇక ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆస్వాదించాలనుకునేవారికి కూడా ఓటీటీ వేదికగా కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. హాట్స్టార్‌లో మార్చి 26న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే జీ5లో ‘విడుదల’ సినిమా పార్ట్-2 మార్చి 28న విడుదల కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో ‘మిలియన్ డాలర్ సీక్రెట్’ అనే కొత్త వెబ్ సిరీస్ మార్చి 26న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కంటెంట్‌లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం గ్యారంటీ అని చెప్పొచ్చు.
ఉగాది పండుగను పురస్కరించుకుని విడుదల కానున్న ఈ సినిమాలు, ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండటంతో సినీ పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా మోహన్ లాల్ , విక్రమ్, నితిన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు ఉండటంతో వీటి బాక్సాఫీస్ రన్ ఎలా ఉండబోతోందో చూడాలి. అలాగే ఓటీటీ లో కూడా క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ప్రధానమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ వారం సినీ అభిమానులకు పండగే పండగ!