Pawan Kalyan : ఇది కదా పవన్ మంచితనం అంటే..అందుకే నువ్వంటే అందరికి ఇష్టం
వైసీపీ నేతలపై కానీ కార్యకర్తలపై కానీ ఎవ్వరు దాడి చేయకూడదని , వల్గర్ గా మాట్లాడకూడదని సూచించారు
- Author : Sudheer
Date : 04-07-2024 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంచోడో అనే సంగతి చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలాడి వరకు అందరికి తెలుసు..కానీ మరి ఇంత మంచోడా..? అని మరోసారి నిరూపించాడు. ఎవరైనా మనల్ని తిట్టినా, కొట్టిన , మనకు హాని కలుగజేసిన..వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చూస్తాం…టైం చూసుకొని వాడ్ని దెబ్బతీయాలని , లేదా దెబ్బకు దెబ్బ కొట్టాలని అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనని అనరాని మాటలు అన్నాసరే..బూతులు తిట్టినా సరే..వారిని వదిలెయ్యండి అని తెలిపి శభాష్ అనిపించుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ ను వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ దగ్గరి నుండి వైసీపీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎంతగా టార్గెట్ చేసారో తెలియంది కాదు..ఇంట్లో ఉన్న మహిళలను , బిడ్డలను కూడా వదిలిపెట్టకుండా కొంతమంది నీచులు దారుణమైన పదజాలం వాడారు. కానీ ఏనాడూ పవన్ కళ్యాణ్..వారిని తిట్టడం కానీ…వారు అనేవిధంగా ఈయన అనడం కానీ చేయలేదు. టైం వస్తుంది..చూసుకుంటా అన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఇక ప్రజలు కూడా అంతే మౌనంగా ఉండి..ఓట్ల రూపంలో వారి ఆగ్రహాన్ని , కసిని చూపించారు. ఇక అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ అంతే మౌనంగా ఉండమని చెప్పడం ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. అలాగే వైసీపీ నేతలపై కానీ కార్యకర్తలపై కానీ ఎవ్వరు దాడి చేయకూడదని , వల్గర్ గా మాట్లాడకూడదని సూచించారు. సోషల్ మీడియా లో కూడా ఎలాంటి పోస్ట్ లు పెట్టకూడదని తెలిపి ఆయన ఎంత మంచోడో మరోసారి చెప్పకనే చెప్పాడు. వైసీపీ శ్రేణులు, నేతలు చేసిందే మీరు చేస్తే వారికీ , మీకు తేడా ఏముంటుంది..? వదిలేద్దాం..ఏదైనా ఎక్కువా చేస్తే చట్టం చూసుకుంటుంది..అంతే తప్ప మీరు మాత్రం ఎవరిపై ఎలాంటి దాడి చేయకండి..అంటూ సూచించారు. పవన్ చెప్పిన ఈ మాటలకు వేదిక ఫై ఉన్న వారే కాదు కింద ఉన్న ప్రజలు సైతం చప్పట్లతో హోరెత్తించారు.
ఆయన మాట మీద ఇంక మీ గురించి ఎలాంటి పోస్ట్లు పెట్టాం రా Paytm Puppies … @PawanKalyan pic.twitter.com/JxsItMaACp
— Legend PawanKalyan FC™ (@Legend_PSPK) July 3, 2024
Read Also : Pooja Hegde : ఏంటి ఈ అమ్మడు ఐటంగా కూడా పనికిరాకుండా పోయిందా..?