Thandel: తండేల్ సినిమా నుంచి నమో నమః శివాయ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్!
నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా నుంచి తాజాగా శివయ్య ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
- By Anshu Published Date - 10:03 AM, Thu - 27 February 25

నాగ చైతన్య,సాయి పల్లవి కలిసిన తాజా చిత్రాన్ని తండేల్. చంద్ర మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ శివరాత్రి సందర్భంగా “నమో నమః శివాయ ” ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ వీడియోని విడుదల ఈ వీడియో కాస్త మరింత వైరల్ గా మారింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని నృత్య దర్శకుడు శేఖర్ నేతృత్వంలో కొనసాగింది. నాగ చైతన్య, సాయిపల్లవితో పాటు, వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో ఈ సాంగ్ ను తెరకెక్కించారు.
దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ప్రతి ఏటా అక్కడ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో ఈ పాటను తెరకెక్కించారు. అందుకోసం భారీ సెట్స్ తో వేసి ప్రేక్షకులకు చూపించారు. ఈ వీడియో విజువల్ గా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విరోధుల ఈ 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ ని సాధించడంతో నాగచైతన్య 100 కోట్ల క్లబ్ లోకి చేరిన హీరోలను ఒకరిగా నిలిచారు.