Tamannaah: తమన్నా విజయ్ వర్మల ఫోటో వైరల్
తమన్నా విజయ్ వర్మల ప్రేమ కథపై ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి లవ్ కహానీపై బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది
- Author : Praveen Aluthuru
Date : 14-06-2023 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
Tamannaah: తమన్నా విజయ్ వర్మల ప్రేమ కథపై ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి లవ్ కహానీపై బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తమన్నా వర్మతో ఉన్న రిలేషన్ ఏంటో బయటపెట్టింది. ఈ సమయంలో 2022 లో తమన్నా విజయ్ వర్మ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో తమన్నా భాటియా విజయ్ వర్మ చేయి పట్టుకుని కనిపించనుంది. విశేషమేమిటంటే 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్ పార్టీలో తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత వీరి ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్నాళ్ళు వాళ్ళ రిలేషన్ పై మౌనంగా ఉన్నప్పటికీ తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ బంధాన్ని ధృవీకరించారు. విజయ్ వర్మ తనకు చాలా ప్రత్యేకమని, అతనితో తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది.
2022లో విజయ్ వర్మతో దిగిన ఫోటోని తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే అప్పటి ఆ ఫోటోని తాజాగా వోగ్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై చాలా మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. విలన్ తో మిల్కీ బ్యూటీ అంటూ హెడ్డింగ్స్ జోడిస్తున్నారు.
Read More: IPL 2023 Final: రెడ్ బుల్ తాగి బ్యాటింగ్ చేసిన: డెవాన్ కాన్వే