Tabu : పవర్ స్టార్ ఛాన్స్ వదులుకున్న టబు.. ఆమె ప్లేస్ లో ఎవరంటే..?
Tabu తెలుగు సినిమాలు చేసి ఆ క్రేజ్ తో బాలీవుడ్ కి వెళ్లిన టబు అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఒకరైన టబు అడపాదడపా తెలుగు సినిమాల్లో
- Author : Ramesh
Date : 20-05-2024 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
Tabu తెలుగు సినిమాలు చేసి ఆ క్రేజ్ తో బాలీవుడ్ కి వెళ్లిన టబు అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఒకరైన టబు అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తుంది. ఐతే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె కాదనేసిందని టాక్. బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక టబు పవన్ ఛాన్స్ కాదనేసిందట. ఇంతకీ పవన్ ఏ సినిమా టబు చేయనంది అంటే అది సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ అని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో టబుని అనుకున్నారట. కానీ టబు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె ప్లేస్ లో శ్రీయా రెడ్డిని తీసుకున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఛాన్స్ సర్ ప్రైజ్ చేసినా డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరక ఆ ఛాన్స్ వదులుకుందట.
టబు చేయాల్సిన ఆ పాత్రని శ్రీయా రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తైందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ మూవీగా రాబోతున్న ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
Also Read : Manchu Manoj : సూపర్ విలన్‌గా మంచు మనోజ్.. ‘మిరాయ్’ న్యూ గ్లింప్స్ రిలీజ్..