HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Suyodhana Review Priyadarshis Suyodhana Review

Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suyodhana Review
Suyodhana Review

Priyadarshi టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రియదర్శికి మరో విజయం దక్కిందా? అన్నది రివ్యూలో చూద్దాం.

సినిమా కథ:

వరుణ్ (ప్రియదర్శి) ఒక ‘ఫోలే’ (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్‌కి చిన్నప్పటి నుండి ‘సుయోధన’ అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ళముందు కదలాడుతూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా అతను భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్ర అంటే చాలా ఇష్టం. ఇది చూసి వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక పెద్దవాడైన వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. రాజకీయంగా ఎదిగిన తండ్రి ఎమ్మేల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో హీరోయిన్ సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా వరుణ్‌కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతోందని ఆరా తీసిన హీరోకి తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాష్‌నే వరుణ్‌కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. అదే సమయంలో తండ్రి కొడుకులపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది, తండ్రి చనిపోతాడు. వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? ఇందులో పొలిటికల్ కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం తనకు ఎందుకు వినబడుతుంది? సినిమాలో అసలు సుయోధన ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తదే అయినా బాగా చేశాడు. ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ టాలీవుడ్ ప్రేక్షకులకు ‘ఫోలే’ ఆర్టిస్ట్ అనేది కొత్త ట్రీట్మెంట్ అనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా అని సుయోధన ద్వారా ప్రేక్షకులు తెలుసుకుంటారు. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు థ్రిల్ ఇస్తాయి. సినిమా ఆరంభం నుంచి దర్శకుడు ప్రేక్షకులకు సస్పెన్స్ క్రియేట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సగటు ఆడియెన్స్ వాట్ నెక్స్ట్ అనేలా చేశాడు. ఈ సినిమా విషయంలో ‘సౌండ్’ కీలక పాత్ర పోషించింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్‌కు జై క్రిష్ అందించిన సంగీతం దోహదపడింది. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే అక్కడక్కడ ల్యాగ్ అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత పకడ్బందీగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండా తెరకెక్కించాడు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ను కూడా బాగా చూపించాడు.

నటీనటుల విషయానికొస్తే:

ఎప్పటిలాగే ప్రియదర్శి తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సరైన పాత్ర పడితే చాలు పరకాయ ప్రవేశం చేస్తారని మరోసారి దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. తన డైలాగ్ పవర్, నటనతో సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలిచారు. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో మెప్పించారు. హీరోయిన్ ద్రిశికా చందర్‌కు మంచి పాత్ర దక్కింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ తమ పాత్రలతో మెప్పించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా మెరుస్తారు. వాళ్ల పాత్రలను కావాలని కాకుండా కథలో భాగమయ్యేలా రాసుకున్న దర్శకుడిని అభినందించాల్సిందే. సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే సౌండ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తుంది.

ఫైనల్: రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే ‘సుయోధన’ మంచి ఛాయిస్.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Drishika Chandar
  • Movie Review And Rating
  • Priyadarshi
  • Priyadarshi Pulikonda
  • Saikumar
  • Suyodhana Review
  • Telugu Cinema
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • 'Rao Bahadur' Movie Review

    Satyadev: ‘రావు బహదూర్’ మూవీ రివ్యూ

  • Nagabandham Movie Review

    Nagabandham: నాగబంధం మూవీ రివ్యూ

Latest News

  • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

  • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

  • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd