Pawan Kalyan OG : పవర్ స్టార్ OGలో మరో స్టార్ హీరో..?
Pawan Kalyan OG ఓజీని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ సినిమాలో క్యామియో రోల్ చేసే ఆ హీరో ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఐతే సోషల్ మీడియాలో ఈ వార్త లీక్
- Author : Ramesh
Date : 01-12-2024 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan OG పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. పవన్ ఓ పక్క వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటూనే ఓజీకి కావాల్సిన డేట్స్ ఇచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకున్నాడట. రీసెంట్ గానే వీరమల్లు సెట్స్ లో జాయిన్ అయిన పవన్ (Pawan Kalyan) ఓజీకి కూడా డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గ్లింప్స్ తోనే సూపర్ బజ్ ఏర్పరచుకుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా ఓజీ నుంచి ఒక సూపర్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో ఒక స్టార్ హీరో క్యామియో ఉంటుందని టాక్.
ఈ వార్త లీక్ అవ్వగానే..
సుజిత్ (Sujith) ఓజీ (OG)ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ సినిమాలో క్యామియో రోల్ చేసే ఆ హీరో ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఐతే సోషల్ మీడియాలో ఈ వార్త లీక్ అవ్వగానే సుజిత్ డైరెక్షన్ లో సాహో (Saho) సినిమా చేసిన ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో క్యామియో రోల్ చేస్తాడని హడావిడి చేస్తున్నారు.
ప్రభాస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కానీ పవర్ స్టార్ సినిమాలో క్యామియో కోసం ఎవరిని దించుతున్నారన్నది ఆసక్తి కరంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీపై వస్తున్న ఈ అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుండగా సినిమా కచ్చితంగా ఫ్యాన్ ఫీస్ట్ అందిస్తుందని ఫిక్స్ అయ్యారు.
Also Read : Vijay Sethupathi : చైనాలో విజయ్ సేతుపతి మహారాజా కలెక్షన్ల దూకుడు..!