SSMB 29 Update: మహేష్- రాజమౌళి మూవీ.. లీక్ వదిలిన తనయుడు!
ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి ఈ కథను వారణాసి నేపథ్యంగా సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు.
- By Gopichand Published Date - 05:58 PM, Fri - 24 October 25
SSMB 29 Update: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌ల్లో SSMB29 ముందుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ (SSMB 29 Update)పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం నుంచి ఎప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి తనయుడు కాల భైరవ తాజాగా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.
మ్యూజిక్ పనులు మొదలు
తాను స్వరాలు సమకూర్చిన ‘మోగ్లీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన కాల భైరవ SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ్యూజిక్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘‘నాన్నగారి సినిమాల్లో పని ఉంటే కచ్చితంగా నాకు చెబుతారు. ముఖ్యంగా రికార్డింగ్ సెషన్స్‌కు వెళ్తాను. SSMB29కు సంబంధించి కూడా సంగీత పనులు ఇటీవల మొదలయ్యాయి. నేను కూడా అందులో భాగమయ్యాను’’ అని ఆయన తెలిపారు. అగ్ర దర్శకుడి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన సంగీత కార్యక్రమాలు ప్రారంభం కావడం శుభసూచకంగా భావించిన మహేశ్ అభిమానులు ఈ ప్రకటనతో తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేస్తున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా నేపథ్య సంగీతంపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.
Also Read: Blood Sugar: మధుమేహం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!
నవంబర్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్
సంగీత పనులు మొదలైనప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అసలైన అధికారిక అప్‌డేట్ నవంబరులో విడుదల కానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. కేవలం టైటిల్‌ను మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియో, టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మెగా అప్‌డేట్‌ను హైదరాబాద్ వేదికగా ఓ భారీ ప్రెస్‌మీట్ లేదా ఈవెంట్ నిర్వహించి విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ వేదిక నుంచే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవెంట్‌కు అనువైన, భారీస్థాయి వేదిక కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా వేదికపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వారణాసి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథ
ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి ఈ కథను వారణాసి నేపథ్యంగా సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ ఫ్రాంచైజీ ‘ఇండియానా జోన్స్’ తరహాలో అన్వేషణ, సాహసాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.