SS Rajamouli-Mahesh Babu: మహేశ్ బాబు- రాజమౌళి మూవీపై బిగ్ అప్డేట్..!
తాజాగా దర్శకుడు రాజమౌళి.. మహేశ్ బాబు అభిమానులకు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చారు. అదే మూవీపై అప్డేట్. తాజాగా మహేశ్ మూవీకి సంబంధించిన ఎస్ఎస్ఎంబీ 29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Gopichand Published Date - 07:38 PM, Tue - 17 September 24

SS Rajamouli-Mahesh Babu: టాలీవుడ్‌తో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తోన్న కాంబినేషన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి SS (Rajamouli-Mahesh Babu) కలయిక. వీరిద్దరూ సినిమా ఎనౌన్స్ చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఎటువంటి అప్డేట్ లేదు. ఇటీవల మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మూవీ అప్డేట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మహేశ్ పుట్టినరోజు మూవీ ఎలాంటి అప్టేడ్ కాదు కదా.. కనీసం పోస్టర్ కూడా విడుదల చేయలేదు. దీంతో ఇటు సినీ ప్రేక్షకులు, సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ కాస్తంత నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల ఊహగానాలు వినిపించాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుందని, స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని వార్తలు వచ్చాయి.
వీటికి బలం చేకూరేలా ఇటీవల రాజమౌళి తన అన్న కీరవాణి కొడుకు శ్రీసింహ మత్తు వదలరా-2 మూవీ విడుదల సందర్భంగా చేసిన ప్రమోషన్ వీడియోలో ఎస్ఎస్ఆర్ఎంబీ అప్డేట్ ఏమైనా చెప్తారా అని అడిగితే..? కర్రతో కొడతా ఇక్కడి నుంచి వెళ్లు అప్డేట్ లేదు ఏం లేదు అని ఫన్నీ వేలో చెప్పారు. దీంతో మహేశ్ అభిమానులు కూడా ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సైలెంట్ అయ్యారు.
Also Read: Wayanad Relief Fund : సీఎం విజయన్ మెమోరాండంపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్
#SSMB29 #MaheshBabu #Rajamouli pic.twitter.com/OWEkfq1a8P
— Aadhan Telugu (@AadhanTelugu) September 17, 2024
అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి.. మహేశ్ బాబు అభిమానులకు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చారు. అదే మూవీపై అప్డేట్. తాజాగా మహేశ్ మూవీకి సంబంధించిన ఎస్ఎస్ఎంబీ 29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ కథ అందించినట్లుగా, సినిమాటోగ్రఫీ పీఎస్ వినోద్ అని రాసి ఉంది. అంతేకాకుండా షూటింగ్‌కు రోజులు దగ్గర పడ్డాయి అనే ఒక క్యాప్షన్ కూడా ఉంది. దీంతో ఈ మూవీ షూటింగ్ దసరా రోజున ప్రారంభిస్తారని సమాచారం అందుతోంది. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఎస్ఎస్ఎంబీ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించనుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు లీడ్ రోల్‌లో నటించనున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. ఈ మూవీకి దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ అని అంచనా వేస్తున్నారు. ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అని సమాచారం. 18వ శతాబ్ధంలో జరిగే కథ అని, సినిమా ఎక్కువ భాగం అడవుల్లో షూటింగ్ జరుపుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.