HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sreeleela Tilak Varma Dating Rumors The Actresss Mother Responds

శ్రీలీల, తిలక్‌ వర్మ డేటింగ్ రూమర్స్‌.. స్పందించిన హీరోయిన్‌ తల్లి..!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2026 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sreeleela-Tilak Varma Dating Rumors: The Actress's Mother Responds!
Sreeleela-Tilak Varma Dating Rumors: The Actress's Mother Responds!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె తల్లి స్వర్ణలత తెరదించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల్లో అణువంత కూడా నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ స్వర్ణలత మాట్లాడుతూ.. “ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్‌తో పాటు చదువులపైనా పూర్తి దృష్టి పెట్టింది. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన వైద్య విద్యపై ఏకాగ్రత చూపుతోంది. ముఖ్యంగా నీట్-పీజీ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే దశకు ఇంకా చాలా సమయం ఉంది. బహుశా మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాతే ఆ విషయాలపై దృష్టి పెడుతుంది” అని వివరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంఘటనల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. 2025 డిసెంబర్‌లో తిరుమలలో శ్రీలీల, తిలక్ వర్మ కలిసి కనిపించడం, వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌కు శ్రీలీల హాజరుకావడం వంటివి కేవలం యాదృచ్ఛిక సంఘటనలేనని తెలిపారు. వాటి ఆధారంగా ఊహాగానాలు సృష్టించి సంబంధాన్ని అంటగట్టడం సరికాదని ఆమె హితవు పలికారు.

గతంలో కార్తిక్ ఆర్యన్‌తో వచ్చిన వార్తలను కూడా గుర్తుచేసిన స్వర్ణలత
గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి ప్రచారమే జరిగిందని స్వర్ణలత గుర్తుచేశారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల రిలేషన్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. “కార్తిక్ ఆర్యన్ తల్లి, నేను ఇద్దరం గైనకాలజిస్టులం. మా మధ్య ఉన్న వృత్తిపరమైన పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అప్పట్లో ఇలాంటి కథనాలే సృష్టించారు” అని ఆమె పేర్కొన్నారు. సినీ తారల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండానే కథనాలు ప్రచారం చేయడం తగదని, అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆమె సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricketer
  • dating
  • Dating Rumors
  • sreeleela
  • Tilak Varma
  • tollywood

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

  • Maharashtra CM's wife insulted Sreeleela.

    Sreeleela: శ్రీలీలను అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd