Sonu Sood : తెలుగు రాష్ట్రాలకు రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన రియల్ హీరో సోనూసూద్
Sonu Sood 5 Cr Donation : ఇప్పుడు ఆర్ధిక సాయం చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు
- By Sudheer Published Date - 12:52 PM, Sun - 8 September 24

Sonu Sood 5 Cr Donation to Telugu States : సోనూసూద్ (Sonu Sood ) ..తెరపై విలన్..నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో. కరోనా (Corona) సమయంలో సోనూసూద్ చేసిన సాయం ఎవ్వరు..ఎప్పటికి మరువరు. కన్నవారే సాయం చేయని ఆ రోజుల్లో మీకు నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి మెడిసిన్ , ఆక్సిజన్ , ఫుడ్ , నిత్యావసరాలు , రవాణా సదుపాయం ఇలా ఎన్నో చేసి రియల్ హీరో , దేవుడు , ఆపత్భాందవుడు అయ్యాడు. అప్పటి నుండి సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ (Sood Charity Foundation) ద్వారా ఎవరు ఆపద లో ఉన్న ఆదుకుంటూ వస్తున్నారు.
రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన రియల్ హీరో సోనూసూద్
తాజాగా భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలను చూసి చలించిపోయిన ఆయన వరద బాధితులకు ఆహారం, తాగు నీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్‌కు సంబంధించిన బృందం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సేవలు అందిస్తున్నాయి. సాయం కావాలంటే తనను సంప్రదించాలని సోనూసూద్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఆర్ధిక సాయం చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు. ఈ భారీ విరాళం తెలిసి ప్రతి ఒక్కరు సోనూసూద్ ఫై అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటె వరద బాధితులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇచ్చిన పిలుపు మేరకు పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. శనివారం పలువురు దాతలు సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. వరుణ్ గ్రూపునకు చెందిన వల్లూరుపల్లి లక్ష్మీకిషోర్(వరుణ్ గ్రూప్ డైరెక్టర్), వల్లూరుపల్లి వరుణ్ దేవ్(ఎండీ) రూ.2 కోట్లు విరాళం అందించారు. అలాగే ఆర్.వీ.ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున డైరెక్టర్ శర్నాల గణేష్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఏపీ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ రూ.25 లక్షలు, డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, సిబార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రూ.10 లక్షలు, ఎస్.ఎన్.పూర్ణిమ రూ.5 లక్షలు(ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, విజయవాడ చాప్టర్), బి.శాంతి వరలక్ష్మీ రూ.1 లక్షా 25 వేలు, టీడీపీ నేత గోనుగుండ్ల కోటేశ్వరరావు రూ.1 లక్షా 16 వేలు చొప్పున విరాళం అందించారు.
Read Also : Actress Madhavi Latha : హోమ్ మంత్రి అనిత ఫై నటి మాధవీలత ఫైర్