Prabhas : ప్రభాస్ కోసం సీతారామం సెంటిమెంట్..!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సలార్ 1 తో డిసెంబర్ లో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి కల్కి వస్తుంది.
- Author : Ramesh
Date : 05-12-2023 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సలార్ 1 తో డిసెంబర్ లో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి కల్కి వస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ మారుతి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటుగా సందీప్ వంగతో ఒక సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమా తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడితో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది.
హను తో విశాల్ చంద్రశేఖర్ కాంబో సినిమాకు మంచి మ్యూజిక్ అందిస్తుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో మ్యూజిక్ కూడా ఒకటే. హను ప్రభాస్ సినిమాకు కూడా విశాల్ ని రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సీతారామ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ ప్రభాస్ సినిమా రాబోతుంది.
హను కథ కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. సీతారామం తర్వాత డబల్ ఎనర్జీతో అతను సినిమా చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. 2024 సెకండ్ హాఫ్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
Also Read : Animal movie 4 Days Collections : 4 రోజుల్లో 425 కోట్లు.. ఇది యానిమల్ బాక్సఫీస్ విధ్వంసం..!
We’re now on WhatsApp : Click to Join