Shresta Iyer: ఐటమ్ సాంగ్‌తో మెరుపులు.. శ్రేయస్ అయ్యర్ సోదరి వివరాలివీ
ఇటీవలే ‘సర్కారీ బచ్చా’ సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అనే ఐటమ్ సాంగ్‌కు శ్రేష్ఠ(Shresta Iyer) డ్యాన్స్ చేశారని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు.
- By Pasha Published Date - 03:36 PM, Thu - 6 March 25

Shresta Iyer: స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ గురించి ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో సెర్చ్ చేస్తున్నారు. ఇటీవలే ఆమె తన తమ్ముడి ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు.. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు హాజరయ్యారు. గ్యాలరీలో నుంచి శ్రేయస్ అయ్యర్‌ను ఉత్సాహపరుస్తూ మీడియా దృష్టిని శ్రేష్ఠ అయ్యర్ ఆకట్టుకున్నారు. దీంతో అందరూ ఆమె నేపథ్యం గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నారు. ఇటీవలే ‘సర్కారీ బచ్చా’ సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అనే ఐటమ్ సాంగ్‌కు శ్రేష్ఠ(Shresta Iyer) డ్యాన్స్ చేశారని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాటకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈసందర్భంగా ఆమెకు సంబంధించిన విశేషాలివీ..
Also Read :YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వాచ్‌మన్ రంగన్న మరణంపై భార్య సంచలన కామెంట్స్
శ్రేష్ఠ అయ్యర్ గురించి..
- శ్రేయస్ అయ్యర్ అక్క శ్రేష్ఠ అయ్యర్ 1990 ఏప్రిల్ 29న ముంబైలో జన్మించారు.
- వీరి తండ్రి సంతోష్ అయ్యర్ కేరళ వాస్తవ్యులు. తల్లి రోహిణి అయ్యర్ కర్ణాటకలోని మంగళూరు వాస్తవ్యులు.
- శ్రేయస్ అయ్యర్, శ్రేష్ఠ అయ్యర్‌ల పూర్వీకులు కేరళలోని త్రిసూర్ వాస్తవ్యులు.
- ఈ కుటుంబం ముంబైలో స్థిరపడింది.
- ముంబైలోని రాంనారాయణ్ రూయా కాలేజీలో ఆమె గ్రాడ్యుయేషన్ చేశారు.
- శ్రేష్ఠ అయ్యర్ ప్రొఫెషనల్ డ్యాన్సర్, కొరియోగ్రఫర్.
- శ్రేష్ఠకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.40 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
- ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా శ్రేష్ఠ వ్యవహరిస్తున్నారు. తన డ్యాన్స్ క్లిప్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేస్తుంటారు. తద్వారా ఆమెకు మంచి ఆదాయమే లభిస్తుంటుంది.
- శ్రేష్ఠ అయ్యర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
- శ్రేష్ఠ అయ్యర్, శ్రేయస్ అయ్యర్‌లు ముంబైలోని వర్లీ ఏరియాలో ఉన్న కమలా మిల్స్ సమీపంలోని ‘లోధా వరల్డ్ క్రెస్ట్’లో ఉన్న 4 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్‌మెంటులో తమ పేరెంట్స్‌తో కలిసి నివసిస్తున్నారు.