Sambhavna Vs Sana : బుర్ఖా ధరించమన్న సనా ఖాన్.. వీడియోపై దుమారం.. సంభావన రియాక్షన్
ఈ వీడియో వ్యవహారం మరో మలుపును తీసుకుంటుండటంతో సంభావనా సేథ్(Sambhavna Vs Sana) స్పందించారు.
- By Pasha Published Date - 01:38 PM, Thu - 6 March 25

Sambhavna Vs Sana : సనా ఖాన్, సంభావనా సేథ్‌లు గతంలో ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా ఫేమస్ అయ్యారు. కాలక్రమంలో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఎదిగారు. ఆర్థికంగా బాగానే సంపాదించారు. బుర్ఖా ధరించే విషయంలో తాజాగా వీరిద్దరి మధ్య వివాదం రాచుకుంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
This is the same Sana Khan who shaded #RubinaDilaik by saying that Sana feels ashamed of men who allow their wife to wear modern clothes and now this same Sana Khan is literally shaming Sambhava Seth into wearing Burqa? Is this secularism ? pic.twitter.com/lUIvHERjWt
— Lady Khabri (@KhabriBossLady) March 4, 2025
Also Read :Ram Gopal Varma: మార్ఫింగ్ ఫొటోల కేసు.. వర్మకు హైకోర్టులో ఊరట
సనా వ్యాఖ్యలు ఇవీ..
అసలు విషయం ఏమిటంటే.. రంజాన్ మాసం సందర్భంగా సనాఖాన్ సొంతంగా ఒక పోడ్ కాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సంభావనా సేథ్‌ను సనా ఆహ్వానించారు. ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో సనా జోకింగ్‌గా అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. ‘‘సంభావనా.. నీకు మంచి సల్వార్ కమీజ్ లేదా ? నీకు కొట్టి చెప్పాలా (సరదాగా ఆటపట్టిస్తూ) ? నీ దుపట్టా ఏది ? బుర్ఖాను తీసుకొచ్చి సంభావనకు ఇవ్వండి. బుర్ఖాను వేసుకో సంభావన’’ అని సనా వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో సనా ఖాన్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వ్యక్తిగత విశ్వాస భావనలను సంభావనపై రుద్దేందుకు సనా ట్రై చేశారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Also Read :Bombs Dropped : యుద్ధ విమానం తప్పిదం.. జనావాసాలపై 8 బాంబులు
క్లారిటీ ఇచ్చిన సంభావనా సేథ్
ఈ వీడియో వ్యవహారం మరో మలుపును తీసుకుంటుండటంతో సంభావనా సేథ్(Sambhavna Vs Sana) స్పందించారు. అసలు జరిగిన విషయం ఏమిటి అనే దానిపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను హిందువుగా గర్విస్తాను. నేను ఏం ధరించాలనేది ఇతరులు ఎవరూ నిర్ణయించలేరు’’ అని సంభావన తేల్చి చప్పారు. ‘‘రంజాన్ మాసం సందర్భంగా సనాఖాన్ నిర్వహించిన పోడ్‌కాస్ట్ అది. అలాంటి ప్రోగ్రాంకు నేను షార్ట్స్ ధరించి వెళ్లలేను కదా. ఎందుకంటే నేను అందరి మనోభావాలను గౌరవిస్తాను. ఏది ఏమైనప్పటికీ నా నిర్ణయాలు నా ఇష్టం. అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ బుర్ఖాను ధరించమని ఇతరులు ఎవరూ నన్ను బలవంతపెట్టలేరు’’ అని సంభావనా సేథ్ చెప్పుకొచ్చారు. ‘‘ఆ పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో సనా ఖాన్ నాతో సరదాగా ముచ్చటించింది. ఆమె జోక్స్ వేస్తూ, నా వస్త్రధారణ శైలి గురించి మాట్లాడింది. నా బరువు పెరిగింది. చాలా దుస్తులు ఇప్పుడు నాకు టైట్ అయ్యాయి. దీనిపైనే సనా జోక్స్ వేస్తూ దుపట్టా గురించి, బుర్ఖా గురించి ప్రస్తావించింది. ఈ అంశం ఇంత వివాదానికి దారి తీస్తుందని మేం అనుకోలేదు’’ అని సంభావన తెలిపారు.