Shraddha Arya : కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్
Shraddha Arya : "ఈ రెండు చిన్ని హృదయాలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) మా కుటుంబాన్ని పూర్తి చేసారు. మా హృదయాలు రెండింతల సంతోషంతో నిండిపోయాయి" అంటూ శ్రద్ధా పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 03-12-2024 - 4:04 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya).. తాజాగా కవల పిల్లలకు (twins) జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. “ఈ రెండు చిన్ని హృదయాలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) మా కుటుంబాన్ని పూర్తి చేసారు. మా హృదయాలు రెండింతల సంతోషంతో నిండిపోయాయి” అంటూ శ్రద్ధా పేర్కొన్నారు. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిందని ఇప్పుడు అందరమూ క్షేమంగానే ఉన్నామంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇది చూసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్య దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పంజాబ్ కు చెందిన శ్రద్ధ 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీలో నిశ్శబ్ద్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో “గొడవ”, “రోమియో”, “కోతిమూక” వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకొని, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆ తర్వాత ఎందుకో గానీ మరే తెలుగు సినిమాల్లోనూ కనిపించలేదు.తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించిన శ్రద్ధ 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్‌తో కలిసి ఏడడుగులు వేసింది. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టారన్న శుభవార్తను పంచుకుంది. ఆమె బాలీవుడ్‌లో చివరిసారిగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో నటించింది.
Read Also : Telangana Talli Statue : తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. సవతి తల్లి విగ్రహం- శంబీపూర్ రాజు