Pushpa 2 Stampede : సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు
వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
- Author : Latha Suma
Date : 17-12-2024 - 6:13 IST
Published By : Hashtagu Telugu Desk
Pushpa 2 Stampede : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంధ్య థియేటర్‌కు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యాన్ని వివరణ కోరారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో సూచించారు. వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. డిసెంబర్ 4 రాత్రి పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు రంగం సిద్దం! సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు, 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరిక#sandhya #PoliceIssuesNoticesToSandhyaTheatre pic.twitter.com/B0zbBOtIkg
— Hashtag U (@HashtaguIn) December 17, 2024
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. ఆక్సిజన్ అందని కారణంగా బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడికి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ విచ్చేశామని చెప్పారు. రెండు వారాలు నుంచి తీవ్రంగా గాయపడిన చిన్నారికి చికిత్స కొనసాగుతోందన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అనే విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నామన్నారు.
ఇక ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన అత్యవసర పిటిషన్‌గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బెయిల్ ఆర్డర్లు జైలు అధికారికి చేరేసరికి రాత్రి సమయం పట్టడంతో మరుసటి రోజు 13వ తేదీన జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు.