Allu Arjun Case : అల్లు అర్జున్ కు దిమాక్ లేదా ?
Shocking Facts on Allu Arjun Case : ఐతే తన మీద రాంగ్ ఎలిగేషన్స్ వేస్తున్నారంటూ ఆరోజు సాయంత్రమే హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్. ఈ తొందర తనమే అతన్ని మళ్లీ ఇబ్బందిల్లో పడేలా చేస్తుంది
- By Sudheer Published Date - 03:49 PM, Mon - 23 December 24

ఒక సినిమా హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) అంటే వీరాభిమానం ఉన్నా సంధ్య థియేటర్ (Sandhya Theater) లో పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో అల్లు అర్జున్ చేసిన హంగామా వల్ల ఒక ప్రాణం పోయింది. ఐతే అది యాక్సిడెంటల్లీ జరిగింది తప్ప ఎవరు కావాలని చేసింది కాదని అల్లు అర్జున్ చాలా చిన్నగా చెబుతున్నా నిజా నిజాలు మాత్రం వేరేలా ఉన్నాయని అర్ధమవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ఒకపూట జైలు హడావిడి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయంపై ప్రస్తావించారు. ఐతే తన మీద రాంగ్ ఎలిగేషన్స్ వేస్తున్నారంటూ ఆరోజు సాయంత్రమే హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్. ఈ తొందర తనమే అతన్ని మళ్లీ ఇబ్బందిల్లో పడేలా చేస్తుంది. మళ్లీ కూడా తన తప్పేం లేదు అన్నట్టు కవర్ డ్రైవ్ చేసినా సరే అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వల్ల అతనికి ఇంకాస్త ఎఫెక్ట్ పడేలా చేసిందే తప్ప లాభం లేదు. మరోపక్క ఆదివారం సీపీ ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అన్నది వివరించారు.
పోలీసులు చెప్పింది చూస్తే అల్లు అర్జున్ చెప్పింది పూర్తిగా రివర్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే అతన్ని రిస్క్ లో పడేస్తుంది. తానొక స్టార్ అయ్యుండి అల్లు అర్జున్ ఈ ఇష్యూపై తీసుకుంటున్న స్టాండ్.. మాట్లాడుతున్న తీరు ఇవేవి ఫ్యాన్స్ కి ఎక్కట్లేదు సరికదా ఇంకా మిస్ గైడ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి అసలు దిమాక్ ఉందా లేదా అంటూ కొందరు ఆయన ఫ్యాన్సే ఫైర్ అవుతున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వరకు అల్లు అర్జున్ ఎంతసేపటికి తాను ఈ కేసు నుంచి బయట పడాలన్న ఆలోచన తప్ప మృతురాలు కుటుంబ గురించి ఆలోచిస్తున్నట్టు లేదు. వాళ్లని వెళ్లి కలవాలని ఉన్నా లీగల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతున్నా అని చెబుతున్న అల్లు అర్జున్ పై ఒక వీరాభిమాని వైల్డ్ ఫైర్ స్టేట్మెంట్స్.. ఇష్యూపై అల్లు అర్జున్ స్టాండ్ గురించి ఎలా విశ్లేషించారో ఈ కింద వీడియోలో చూడండి.
Read Also : Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ