Sharwanand: ఘనంగా నటుడు శర్వానంద్ వివాహం.. పెళ్ళిలో సందడి చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..!
నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.
- Author : Gopichand
Date : 04-06-2023 - 1:37 IST
Published By : Hashtagu Telugu Desk
Sharwanand: నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఏడాది జనవరి 26న నిశ్చితార్ధం చేసుకున్న శర్వానంద్, మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షిత రెడ్డి (Rakshitha Reddy)ని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు పెళ్లి జరిగింది. శర్వానంద్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
#futurehollywoodstar Great Actor Great Performer #Ramcharan at his Childhood Friend Hero Sharwanand and RakshitaReddy’s Sangeet function pic.twitter.com/K0ir23gF2D
— Gulte (@GulteOfficial) June 2, 2023
Also Read: Venkatesh : ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటించాల్సింది.. మరి ఏమైంది?
రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా రెండు రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. శర్వానంద్ పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు శర్వానంద్ అత్యంత సన్నిహితుడు రామ్ చరణ్ కూడా హాజరైయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్, సిద్దార్థ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక శర్వానంద్ భార్య రక్షిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని తెలుస్తోంది. ఇక ఆమె తండ్రి తెలంగాణ హైకోర్ట్ లాయర్ మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. ఇక శర్వానంద్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఓ క్రేజీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.