Sharwanand Ram Charan: చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శర్వానంద్?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం యాంకర్ గా విన్ యాప్ లో ఉస్తాద్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 8 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఇక
- Author : Anshu
Date : 09-02-2024 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం యాంకర్ గా విన్ యాప్ లో ఉస్తాద్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 8 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఇక ఇప్పటివరకు ఈ షో కి రానా, రవితేజ, తేజా సజ్జా లాంటి హీరోలు పాల్గొని సందడి సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో శర్వానంద్ ఉస్తాద్ షోకి వచ్చాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో శర్వానంద్ చేసిన చెర్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
కాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు చిన్నప్పటినుంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. చెర్రీ శర్వానంద్ తో పాటు మనోజ్ కూడా చిన్నప్పటినుంచి కలిసే తిరిగారు. వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా ఉంది. ఇకపోతే ఆ ప్రోమో విషయానికి వస్తే.. శర్వానంద్ ఉస్తాద్ షోలోకి రాగా.. స్క్రీన్ పై శర్వానంద్, చిరంజీవి, రామ్ చరణ్ ఉన్న ఫోటో వేసాడు మనోజ్. ఆ ఫోటోని చూసి రామ్ చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని తెలిపారు శర్వానంద్. అలాగే ఆ ఫోటో చిరంజీవి ఇంటి లాన్ లో తీసింది.
Let’s welcome Man of Family’s🤩😆 with his #Ustaad @imsharwanand
Promo Out Now! ☺️
▶️: https://t.co/yvLmBEhHnqPremieres Feb 8@etvwin @peoplemediafcy#sharwanand#Ustaad #MM #EtvWin #WinThoWinodam pic.twitter.com/6qis30HEzZ
— ETV Win (@etvwin) February 7, 2024
ఆ లాన్ లో మనం చేసిన పనులు గుర్తున్నాయా అని సరదాగా మనోజ్ అడగడంతో.. అలాంటివి చెప్పకు అని శర్వానంద్ అన్నాడు. అయితే ముగ్గురు కలిసి ఆ లాన్ లో పడి దొర్లాడినట్టు మనోజ్ తెలిపాడు. ఇంకా అక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బోలెడన్ని చిలిపి పనులు చేసారని తెలిపాడు. దీంతో శర్వా, చరణ్ ఫ్రెండ్షిప్ తో పాటు మనోజ్ కూడా వీరితో చిన్నప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ ఈ వీడియో పై సరదాగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.