Tollywood : మేనల్లుడు వచ్చేవరకు వెంకిమామదే హావ..!
Tollywood : సంక్రాంతిని పూర్తిగా క్యాష్ చేసుకొని అసలైన విన్నర్ అనిపించుకుంది
- By Sudheer Published Date - 11:48 AM, Sat - 25 January 25

వెంకీమామ (Venkatesh ) జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. వెంకీ నుండి సరైన హిట్ పడి చాలాకాలమే అవుతుంది. ఒకప్పుడు వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ అంత కలిసి వెళ్లి చూసేవారు. కానీ ఈ మధ్య ఆలా వచ్చి చూసే సినిమాలు వెంకీ చేయలేదు. ఈ టైములో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) అంటూ వచ్చి మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.
ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుండే సినిమాకు పాజిటివ్ బజ్ మొదలైంది. ఆ తర్వాత సినిమా సాంగ్స్ , ప్రమోషన్స్ ఇలా ప్రతిదీ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఇక విడుదల తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. మొన్నటి వరకు కూడా టికెట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతిని పూర్తిగా క్యాష్ చేసుకొని అసలైన విన్నర్ అనిపించుకుంది.
Pocharam Municipality : హైడ్రా కూల్చివేతలు..ఆనందంలో ప్రజలు
10 రోజుల్లోనే రూ.230 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఏ రేంజ్ లో ఆడిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ హావ మరో పది రోజులు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న శుక్రవారం విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క చాలాచోట్ల గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తీసేసి సంక్రాంతికి వస్తున్నాం వేయడం మొదలుపెట్టారు. డాకు మహారాజ్ అంత పాజిటివ్ టాక్ తోనూ ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ఒక్కసారిగా స్లో అయిపోయింది. దీంతో ఫిబ్రవరి 07 న నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ (Thandel) రాబోతుంది. ఆ మూవీ వచ్చేవరకు సంక్రాంతికి వస్తున్నాం హావనే కొనసాగబోతున్నట్లు అర్ధం అవుతుంది.