Bollywood: అరుదైన రికార్డు సాధించిన ఇండియన్ మూవీ.. రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లు.. ఆ సినిమా ఏదంటే?
తాజాగా ఒక బాలీవుడ్ సినిమాను థియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్ చేయగా ఏకంగా 50 కోట్ల వసూళ్ళని సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.
- By Anshu Published Date - 01:00 PM, Wed - 26 February 25

ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన సినిమాలను థియేటర్లలో అభిమానుల కోసం మళ్లీ ఇది రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. కేవలం సక్సెస్ అయిన సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ అయిన సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా కూడా ఒక బాలీవుడ్ మూవీ ని రీరిలీజ్ చేశారు. ఈ మూవీ ఏకంగా ఎవరు ఊహించని విధంగా 50 కోట్ల వస్తువులను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటి ఉంది.
అదేంటో, ఆ సినిమా ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సనమ్ తేరి కసమ్ మొదట 2016లో విడుదలైంది. రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. కేవలం రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అప్పట్లో ఇది పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు అదే సినిమాని దాదాపుగా 9 ఏళ్ల తర్వాత తాజాగా ఫిబ్రవరి 7న రీరిలీజ్ చేశారు. ఇటీవల విడుదలై ఆకట్టుకుంటుంది. బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. విడుదల అయిన మొదటి రోజే 5.14 కోట్లు వసూలు చేయడంతో చిత్ర బృందం ఆశ్చర్యపోయింది.
రెండో రోజు వసూళ్లు 9.5 కోట్లకు పెరిగాయి. 2016లో వచ్చిన వసూళ్లను సైతం దాటేసింది. బాక్సాఫీస్ వసూళ్లు పెరిగి మొదటి వారంలో 30.67 కోట్లు వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.50 కోట్లు దాటిందని తెలుస్తోంది. ఈ కలెక్షన్లని చూసి మూవీ మేకర్స్ సైతం షాక్ అవుతున్నారు. అప్పుడు డిజాస్టర్ గా నిలిచిన మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావడంతో ఆశ్చర్యపోతున్నారు. రీ రిలీజ్ లో ఇదే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలవడం విశేషం. ఇప్పటివరకు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. ఈ అరుదైన రికార్డును కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే కేవలం 7 కోట్లనే మాత్రమే సాధించిన ఈ మూవీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్ల వసూలు చేయడం ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పాలి. దీంతో మూవీ మేకర్స్ పండగ చేసుకుంటున్నారు.