Friday Fitness: సమంత ‘డెడ్ హ్యాంగ్’ వర్కవుట్.. ఫిట్ నెస్ లోనూ అదరగొట్టేస్తోంది!
టాలీవుడ్ బ్యూటీ సమంత నటనలోనే కాకుండా ఫిట్ నెస్ లోనూ ముందుంటోంది. ఏమాత్రం సమయం దొరికినా జిమ్ గడుపుతూ కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటుంది. హీరోలకే కష్టసాధ్యమైనవాటిని సమంత ఈజీగా చేసేస్తుంది.
- By Balu J Published Date - 01:43 PM, Fri - 19 November 21
టాలీవుడ్ బ్యూటీ సమంత నటనలోనే కాకుండా ఫిట్ నెస్ లోనూ ముందుంటోంది. ఏమాత్రం సమయం దొరికినా జిమ్ గడుపుతూ కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటుంది. హీరోలకే కష్టసాధ్యమైనవాటిని సమంత ఈజీగా చేసేస్తుంది. జిమ్ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను ఆకర్షిస్తుంది. ఫిట్నెస్ విషయంలో చురుకుగా ఉండే సామ్ విడాకుల తర్వాత మళ్లీ మనుపటిలా జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిందని తాజా పోస్ట్‌తో అర్థమవుతుంది. జిమ్‌లో 30కేజీల డంబెల్ (30 kg dumbbell) ను ఎత్తుతున్న స్టిల్‌తోపాటు వీడియోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేసింది. దానికి ‘డెడ్ హ్యాంగ్’ అని పిలిచే ఒక ఎక్సర్‌సైజ్‌ని నెయిల్ చేస్తున్న ఫొటో అది. టై డై బ్లాక్ అథ్లెషర్తో మ్యాచింగ్ స్నీకర్లతో ధరించి కనిపించింది. టోన్డ్ బాడీని మెడపై ఓ టాటూ కూడా ఆకట్టుకుంటోంది. YMC (ఏ మాయ చేసావే, సమంత, నాగ చైతన్య ) ఫొటోలో చూడొచ్చు. సమంతా చాలా దృఢంగా టోన్డ్ బాడీని సొంతం చేసుకుంది. మునుపెన్నడూలేని విధంగా ఫిట్నెస్ లక్ష్యాలను పెట్టుకుంటోంది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహించిన దేవ్ మోహన్, నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటించిన విఘ్నేష్ శివన్ కాతు వాకులా రెండు కాదల్ తో పౌరాణిక చిత్రం శాకుంతలం షూటింగ్ ను కంప్లీట్ చేసింది. రెండు కొత్త ద్విభాషా చిత్రాలను కూడా ప్రకటించింది.
Related News
Summer Foods : వేడి వేసవిలో మంచి జీర్ణక్రియ కోసం ఏమి తినాలి.?
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడంతో భారతదేశం తీవ్రమైన హీట్ వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది.