Game Changer: గేమ్ ఛేంజర్ లో చెర్రీ నుంచి ఆర్ఆర్ఆర్‌కి మించి వేరియేషన్స్ చూస్తారు: సాయి మాధవ్
- By Sailaja Reddy Published Date - 10:00 AM, Sun - 25 February 24

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతోపాటు పాన్ క్
ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామచరణ్. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అవుతున్న కూడా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లు లేవు. దాంతో దర్శకుడు శంకర్ పై చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో రాబోతున్న ఈ సినిమాకు సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మాధవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కర్ని ఎలా పైకి తీసుకు వెళ్లిందో, గేమ్ ఛేంజర్ కూడా ఆ మూవీ యూనిట్ లోని ప్రతి ఒక్కరికి అంతే పేరు తీసుకు వస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్ లో కనిపించబోతున్నారట. మాస్, క్లాస్, రగ్డ్, హుందాగా ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో. అని వేరియేషన్స్ లో రామ్ చరణ్ కనిపిస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానుల్లో.. మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ అప్డేట్ ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ఇచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. మరి ఆ అప్డేట్ టీజర్ అవుతుందా? లేదా గతంలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి క్యాన్సిల్ చేసిన జరగండి సాంగ్ అప్డేట్ అవుతుందా అనేది చూడాలి మరి. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.