RGV Cameo: ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ.. ఏ పాత్ర చేశాడో..?
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ క్యామియో (RGV Cameo) చేస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
- By Gopichand Published Date - 11:23 AM, Thu - 7 September 23

RGV Cameo: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ తారాగణంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‍లో రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది.
భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‍డ్రాప్‍తో ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. భారీ సెట్లు, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సులతో అబ్బురపడేలా ఈ చిత్రం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ‘కల్కి 2898 ఏడీ’లో కొందరి క్యామియో రోల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‍గా ఉండనున్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ క్యామియో (RGV Cameo) చేస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Miss Shetty Mr Polishetty Talk : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ టాక్..
అయితే, తాజాగా ఈ చిత్రంలో ఆయన తన షూటింగ్‍ను పూర్తి చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఆర్జీవీ ఈ చిత్రంలో ఏ పాత్ర చేస్తున్నారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ప్రభాస్, ఆర్జీవీని ఒకే స్క్రీన్ పై చూడాలని చాలా మందికి ఆశగా ఉంది. మరి వారి ఆశ నెరవేరుతుందో.. లేదో చూడాలి. మరోవైపు దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో క్యామియో రోల్‍లో కనిపించడం దాదాపు ఖరారైంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.