HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Rana Daggubati Fires Indigo Airlines

Rana Daggupati: ఇండిగో ఎయిర్ లైన్స్ అంటే మండిపడుతున్న రానా.. కారణం ఏంటంటే?

హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం

  • By Nakshatra Published Date - 09:22 PM, Sun - 4 December 22
Rana Daggupati: ఇండిగో ఎయిర్ లైన్స్ అంటే మండిపడుతున్న రానా.. కారణం ఏంటంటే?

హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత రానా దేవుడిని చాలామంది భల్లాలదేవ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. హీరో రానా ఇండిగో ఎయిర్ లైన్స్ పేరు వినగానే మండిపడుతున్నారు. అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. అసలేం జరిగింది?రానా ఎందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడుతున్నారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాజాగా రానా తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు.

అప్పుడు అక్కడి సిబ్బంది షెడ్యూల్డ్ ఫ్లైట్ కాకుండా మరొక విమానంలో ప్రయాణించాలి అని రానాకి సూచించడంతో పాటు అతని లగేజ్ కూడా అదే విమానంలో వస్తుందని వాళ్ళు తెలిపారు. అయితే సిబ్బంది చెప్పినట్టుగానే రానా ఫ్లైట్లో వెళ్లినప్పటికీ లగేజ్ మాత్రం రాలేదు. దాంతో కోపంతో ఊగిపోయిన బల్లాలదేవ తన లగేజ్ రాలేదని మిస్ అయింది అంటూ అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కూడా లగేజ్ ని వెతికి పెట్టలేకపోయారని మండిపడ్డారు. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురయింది అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రానా.

 

India’s worst airline experience ever @IndiGo6E !! Clueless with flight times…Missing luggage not tracked…staff has no clue 💥 can it be any shittier !! pic.twitter.com/odnjiSJ3xy

— Rana Daggubati (@RanaDaggubati) December 4, 2022

ఇండిగో విమాన సర్వీసులు సరిగా లేవు. మిస్ అయిన లగేజ్ ట్రాకింగ్ కూడా సరిగా లేదు.. ప్రయాణికుల లగేజీ ఎక్కడ ఉంది అని సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. విమానాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. మిస్ అయిన లగేజ్ ని ఎలా కనుగొనాలో తెలియదు. ఇవన్నీ కూడా అక్కడి సిబ్బందికి తెలియవు అంటూ వారిపై సెటైర్లు కూడా వేశారు రానా. అంతే కాకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రచార పోస్టులపై కూడా మండిపడ్డారు. కాగా రానా ట్వీట్ చేసిన దానికి పలువురు అభిమానులు మద్దతుగా ట్వీట్ గతంలో కూడా వాళ్లకి అలాంటి అనుభవం ఎదురయింది అని కామెంట్స్ రూపంలో తెలియజేశారు.

Telegram Channel

Tags  

  • fires
  • indigo air lines
  • Rana Daggupati
  • tollywood

Related News

Natu Natu: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ డ్యాన్స్ చూస్తే పడీపడీ నవ్వుకుంటారు!

Natu Natu: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ డ్యాన్స్ చూస్తే పడీపడీ నవ్వుకుంటారు!

తెలుగు జనాలనే కాదు, ప్రపంచంలోని చాలామందిని ఊపేసిన పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట.

  • Amigos: ‘అమిగోస్’ లో అందంగా మెరిసిన ఆషిక!

    Amigos: ‘అమిగోస్’ లో అందంగా మెరిసిన ఆషిక!

  • Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!

    Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!

  • Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ ప్రస్థానం ఇదే

    Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ ప్రస్థానం ఇదే

  • Vishwanath Passed Away: బ్రేకింగ్.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

    Vishwanath Passed Away: బ్రేకింగ్.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

Latest News

  • Nutrients: తెలిస్తే దీన్ని అస్సలు వదలరు.. 83 రకాల పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  • Nose Surgery: అందం కోసం ముక్కు ప్లాస్టిక్ సర్జరీ.. కొంత సేపటికే మృత్యువాత!

  • Animal Lover: జంతు ప్రేమికుడిగా మారిన రౌడీ హీరో.. ఎవరంటే?

  • Mlc Kavitha: సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ కవిత

  • Yesaswi kondepudi: వివాదంలో సరిగమప ఫేమ్ యసస్వి కొండెపుడి.. ఏం జరిగిందంటే?

Trending

    • Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

    • Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: