Ram Charan Game Changer Trailer : శంకర్ మార్క్ భారీతనం.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్..!
Ram Charan Game Changer Trailer శంకర్ మార్క్ సోషల్ కాజ్ తో ఈ సినిమా వస్తుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక సినిమా తప్పకుండా
- By Ramesh Published Date - 06:19 PM, Thu - 2 January 25

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ లో మరోసారి శంకర్ మార్క్ భారీతనం కనిపిస్తుంది. రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో అదరగొట్టగా కియరా గ్లామర్ థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.
ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా చరణ్ పొలిటీషియన్ తో జరిగే ఫైట్ ని విజువల్ వండర్ గా తెరకెక్కించారు. శంకర్ మార్క్ సోషల్ కాజ్ తో ఈ సినిమా వస్తుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) ట్రైలర్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది.
రామ్ ఛరణ్ ఎనర్జీని శంకర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు ఉన్నారు. ఇక కియరా ( Kiara Advani,) గ్లామర్ కూడా ఆడియన్స్ కి గిలిగింతలు పెట్టనుంది. శంకర్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఐ ఫెస్ట్ మూవీ తీసినట్టుగా ఉంది. మరి ట్రైలర్ తోనే గేమ్ ఛేంజర్ వావ్ అనిపించగ సినిమా ఇంకెలా అనిపిస్తుందో చూడాలి.