Ram Charan Game Changer : గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అదేనా.. లాంగ్ వీకెండ్ పై మెగా స్కెచ్..!
Ram Charan Game Changer మెగా పవర్ స్టార్ రాం చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. స్టార్ సినిమాలకు ఎవరు ముందు రిలీజ్ డేట్
- By Ramesh Published Date - 12:41 PM, Wed - 28 February 24

Ram Charan Game Changer మెగా పవర్ స్టార్ రాం చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. స్టార్ సినిమాలకు ఎవరు ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే వారిదే పైచేయి అవుతుంది. ఈ క్రమంలో దసరాకి ముందే కొంతమంది ఖర్చీఫ్ వేసుకున్నారు. ఎన్.టి.ఆర్ దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. అయితే చరణ్ గేం చేంజర్ కూడా దసరాకి వస్తుందని అణుకున్నారు. కానీ దిల్ రాజు ప్లానింగ్ వేరేలా ఉందని తెలుస్తుంది.
గేమ్ చేంజర్ సినిమాను దసరాని వదిలేసి క్రిస్మస్ రేసులో దించాలని చూస్తున్నారట. క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 25న వచ్చే లాంగ్ వీకెండ్ లో గేం చేంజర్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ఆ డేట్ నే వస్తుందని అంటున్నారు. దిల్ రాజు మెగా స్కెచ్ లో భాగంగా గేం చేంజర్ రిలీజ్ డేట్ ఉండబోతుందని చెప్పొచ్చు.
గేమ్ చేంజర్ శంకర్ మార్క్ సినిమాగా భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియరా అద్వాని నటించగా సినిమాలో శ్రీకాంత్, సునీల్, ప్రభు లాంటి స్టార్స్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.
Also Read : Balakrishna : కన్నప్పలో బాలకృష్ణ.. మంచు విష్ణు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!