Ram Charan : క్లీంకార కోసం నిర్మాతలకు రామ్ చరణ్ కండిషన్స్.. ఏంటో తెలుసా..?
క్లీంకార కోసం నిర్మాతలకు రామ్ చరణ్ కండిషన్స్ పెడుతున్నారట. ఒక తండ్రిగా తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్న రామ్ చరణ్..
- Author : News Desk
Date : 16-06-2024 - 5:34 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan : మెగా వారసుడు రామ్ చరణ్, కామినేని వారసురాలు ఉపాసనను 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళైన పదేళ్ల వరకు ఈ మెగా జంట.. తల్లిదండ్రులు కాకుండా కేవలం దంపతులు గానే జీవిస్తూ వచ్చారు. 2022లో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి మెగా కాంపౌండ్ లో సంబరాలు తీసుకొచ్చారు. 2023 జూన్ 20న మెగా వారి ఇంట ‘క్లీంకార’ అనే మహాలక్ష్మి అడుగుపెట్టింది. ఈ మెగా వారసురాలు రాకతో కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.
ఇక తాతయ్య చిరంజీవి, తండ్రి చరణ్ సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత ఎక్కువ సమయం క్లీంకారతోనే గడుపుతూ చిరు అండ్ చరణ్ తమ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ అయితే.. ఈ ముద్దుల కూతురు కోసం తన నిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడుతున్నారట. ఒక తండ్రిగా తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్న రామ్ చరణ్.. క్లీంకార స్కూల్ కి వెళ్లే వయసు వచ్చే వరకు తనని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటున్నారట.
ప్రొద్దునే తనని నిద్ర లేపడం, స్నానికి తీసుకు వెళ్లడం, దగ్గరుండి ప్రిన్సెస్ లా రెడీ చేయడం, తనకి ఆహారం తినిపించడం, తన డైలీ మార్నింగ్ పనుల్లో కూడా క్లీంకారని భాగం చేయడమే చరణ్ ఇప్పుడు పాటిస్తున్న టైం టేబుల్ అంట. ఉదయం, రాత్రి పూట క్లీంకారకి తానే ఆహారం తినిపిస్తారట. చరణ్ తినిపిస్తే గిన్నిలోని మొత్తం ఆహారం తినేస్తాదట క్లీంకార. అందుకనే సాయంత్రం ఆరు గంటలు అయిన తరువాత షూటింగ్స్ లో పాల్గొనని చరణ్ నిర్మాతలకు తెలియజేశారట.
అందుకనే వేరే ప్రాంతాల్లో షూటింగ్స్ ఉంటే.. ఉపాసన, క్లీంకారని తీసుకోని చరణ్ తో పాటే షూటింగ్స్ కి వెళ్తున్నారు. ఇక చరణ్ నెక్స్ట్ చేయబోయే RC16 నిర్మాతలు అయితే.. చరణ్ కి వెసులుబాటుగా ఆయన ఇంటి దగ్గరలోనే ఓ భారీ విలేజ్ సెట్ ని నిర్మిస్తున్నారట.