Tollywood : బాలకృష్ణ – రామ్ ల ”మల్టీస్టారర్”..?
నందమూరి బాలకృష్ణ - రామ్ కలయికలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
- By Sudheer Published Date - 03:20 PM, Fri - 2 August 24

టాలీవుడ్ (Tollywood) లో మల్టీస్టారర్ చిత్రాలు (Multi star Movies) ఊపందుకుంటున్నాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ , ANR , కృష్ణ తరంలో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రాలు తగ్గిపోయాయి. 2013 లో వెంకటేష్ , మహేష్ బాబు లతో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తెరకెక్కించి మళ్లీ టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు దారితీసాడు. ఈ సినిమా సూపర్ హిట్ తరువాత వరుసగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నందమూరి బాలకృష్ణ – రామ్ కలయికలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తుండగా.. రామ్ (Ram) డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. హీరోయిన్ గా కావ్య థాపర్ ఈ మూవీ లో నటిస్తుండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల (ఆగస్టు 15వ తేదీన) థియేటర్ లో రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత రామ్ – బాలకృష్ణ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడట. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేశ్ బాబు పి తెరకెక్కించబోతున్నారనే టాక్. ఇప్పటికే ఈ కథ ను రామ్ కు వినిపించగా..రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని , త్వరలోనే బాలకృష్ణ కు వినిపించబోతున్నారని అంటున్నారు. అలాగే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుందని .. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మలేం.
Read Also : Intel : 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్