Rajinikanth : హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్.. ఆధ్యాత్మికతపై కీలక వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆధ్యాత్మికత ఎక్కువ. గతంలో ఆయన ఎన్నోసార్లు తీర్థయాత్రలు చేశారు.
- By Pasha Published Date - 12:21 PM, Thu - 30 May 24

Rajinikanth : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆధ్యాత్మికత ఎక్కువ. గతంలో ఆయన ఎన్నోసార్లు తీర్థయాత్రలు చేశారు. ఏటా ఒకటి, రెండుసార్లు రజనీకాంత్ తీర్థయాత్రలు చేస్తుంటారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఆయన హిమాలయాల బాటపట్టారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బద్రినాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను రజనీకాంత్ సందర్శించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్(Rajinikanth) మాట్లాడుతూ.. ‘‘ఆధ్యాత్మిక యాత్రలు చేయడం చాలా మంచిది. ఇవి జీవితంలో చాలా ముఖ్యం. ఏటా నేను హిమాలయాలకు వెళ్తుంటా. వెళ్లిన ప్రతిసారీ నాకు కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సారి కూడా కొత్త అనుభవాలు పొందుతానని నమ్ముతున్నాను. ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరం. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసం’’ అని తెలిపారు.
Also Read :Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్
రజనీకాంత్ ప్రస్తుతం కూలీ, వెట్టయాన్ మూవీస్‌లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రజినీకాంత్‌తో పాటు బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు కలిసి నటించి దాదాపు 38 ఏళ్లు అయింది.1987లో దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ రూపొందించిన మనతిల్ ఉరుధి వేండుమ్ అనే డ్రామాలో రజనీకాంత్, సత్యరాజ్ కలిసి నటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ రజినీకాంత్ కూతురి పాత్రను పోషిస్తోందని రూమర్లు ఉన్నాయి. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న కూలీ సినిమాలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు టైటిల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
Also Read :Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు
రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ మూవీ వివరాల్లోకి వెళితే.. దీనికి టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.