Pushpa In Russia: రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప.. అల్లు అర్జున్, రష్మిక ప్రమోషన్స్ షురూ
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 2021లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
- Author : Balu J
Date : 01-12-2022 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 2021లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ టాలీవుడ్ నే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అందర్నీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం డిసెంబర్ 8న రష్యాలో విడుదల కాబోతోంది. త్వరలోనే అక్కడి థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్దంగా ఉంది. అందుకే, అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా రష్యాలో ల్యాండ్ అయ్యారు. సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు.
రష్యాలో ల్యాండ్ అయిన ఈ హీరోహీరోయిన్లు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీడియాతో ఇంటరాక్షన్ తర్వాత, అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ‘తగ్గేదే లే’ అంటూ రియాక్ట్ అవ్వగా, రష్మిక మాత్రం “పుష్పా ఇన్ రష్యా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇవాళ పుష్ప డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్ షోలు వేయనున్నారు. రష్యాలోని 24 నగరాల్లో జరగనున్న 5వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 8న మాత్రం రష్యావ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది.
సుకుమార్ రచించి, దర్శకత్వం వహించిన పుష్ప-ది రైజ్ 2021 ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మించారు. ఇటీవలనే రష్యాలో పర్యటించిన అల్లు అర్జున్ ‘‘ఇది భారతీయ సినిమా. ఇది అందరి విజయం. అందరం గర్విస్తున్నాం”అని అన్నారు. ఇక ఫుష్ప-2 సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Privyet from Russia ❤️🌸
Pushpa the rise
Day 1- Moscow! @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/HAOjMsVEfo— Rashmika Mandanna (@iamRashmika) November 30, 2022