Pushpa 2 Peelings Song : పుష్ప 2 పీలింగ్స్ సాంగ్ వచ్చేసిందోచ్..!
Pushpa 2 Peelings Song పుష్ప 2 సినిమాలో కరెక్ట్ ప్లేస్ మెంట్ లో సాంగ్ వచ్చింది అంటే సీట్లు చిరిగి పోవాల్సిందే అనిపించేలా ఈ సాంగ్ ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న
- By Ramesh Published Date - 11:56 PM, Sun - 1 December 24

Pushpa 2 Peelings Song పుష్ప 2 సినిమా నుంచి మరో సూపర్ హిట్ సాంగ్ రిలీజైంది. పీకింగ్స్ అంటూ వచ్చిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ చేసుకునేలా ఉంది. పుష్ప 2 ఆల్బం లో ఒక మాస్ సాంగ్ అది కూడా డ్యుయెట్ మిస్ అయ్యిందే అనుకుంటున్న ఫ్యాన్స్ కి పీలింగ్స్ సాంగ్ ఆకలి తీర్చేసింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ (Allu Arjun) డ్యాన్స్, రష్మిక గ్లామర్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది.
పుష్ప 2 (Pushpa 2) సినిమాలో కరెక్ట్ ప్లేస్ మెంట్ లో సాంగ్ వచ్చింది అంటే సీట్లు చిరిగి పోవాల్సిందే అనిపించేలా ఈ సాంగ్ ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప 2 పై పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పడింది. సినిమాతో మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మ్యాజిక్ చూపించబోతున్నారు.
పుష్ప 2 సినిమాలో పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. పుష్ప 1 లో సామీ సామీ కంపోజ్ చేసిన ఆయన పీలింగ్స్ సాంగ్ ని అదరగొట్టేశారు. ముఖ్యంగా రష్మిక (Rashmika) అందాల ప్రదర్శన సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ గా వచ్చిన ఈ సాంగ్ కు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. పుష్ప 2 సినిమా ప్రచార చిత్రాలు ఇంకా ప్రతి అప్డేట్ సినిమా రేంజ్ మరింత పెంచేస్తున్నాయి. మరి ఈ రేంజ్ అంచనాలతో వస్తున్న సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.