Pushpa 2 : పుష్ప 2తో పోటీ ఎందుకని.. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్..!
Pushpa 2 పుష్ప 2 సినిమాకు ఉన్న బజ్ చూసి డిసెంబర్ 6న రిలీజ్ చేయాలనుకున్న ఛావా సినిమాను వాయిదా వేశారు. పుష్ప రాజ్ మేనియా అంతా సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో
- By Ramesh Published Date - 06:25 PM, Thu - 28 November 24

డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 కి పోటీగా డిసెంబర్ 6న విక్కీ కౌశల్ ఛావా సినిమా ను రిలీజ్ అనుకున్నారు. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఛావా (Chhava) సినిమా ఛత్రపతి శివాజి కుమారుడు శంబాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారు. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.
ఐతే Allu Arun పుష్ప 2 సినిమాకు ఉన్న బజ్ చూసి డిసెంబర్ 6న రిలీజ్ చేయాలనుకున్న ఛావా సినిమాను వాయిదా వేశారు. పుష్ప రాజ్ మేనియా అంతా సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా కనిపిస్తుంది. అందుకే ఆ సినిమాకు పోటీగా రావడం కన్నా వాయిదా వేసుకోవడం బెటర్ అని భావించారు. అందుకే ఛావా సినిమాను వాయిదా వేశారు. డిసెంబర్ 6 నుంచి సినిమాను ఫిబ్రవరి 14కి రిలీజ్ ఫిక్స్ చేశారు.
పాన్ ఇండియా లెవెల్ లో..
పుష్ప 2 (Pushpa 2) సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ తీసుకొచ్చింది. ఐతే పుష్ప 2 సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. ఛావాలో కూడా రష్మిక (Rashmika)నే హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తే రష్మిక తన సినిమాతో తనకే పోటీ వచ్చేది. కానీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుని మంచి పనిచేశారు.
ఇక పుష్ప 2 సినిమా నేషనల్ లెవెల్ లో 12 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మోత మోగిపోతుందని చెప్పొచ్చు.
Also Read : Keerthy Suresh : పెట్ పేరుతో ఎప్పుడో హింట్ ఇచ్చిన కీర్తి..!