Keerthy Suresh : పెట్ పేరుతో ఎప్పుడో హింట్ ఇచ్చిన కీర్తి..!
కీర్తి సురేష్ ఆంటోనిని ప్రేమిస్తుంది.. అతనితో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం అంతకుముందు ఎప్పుడో హింట్ ఇచ్చింది. కీర్తి సురేష్ తన పెట్ ని పరిచయం చేస్తూ నైక్ అని దాన్ని పేరు
- By Ramesh Published Date - 05:21 PM, Thu - 28 November 24

మలయాళ భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లంటూ వార్తలు వచ్చాయి. ఐతే మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న కీర్తి సురేష్ 15 ఏళ్లుగా కొనసాగుతుందంటూ చెప్పి తన బోయ్ ఫ్రెండ్ రివీల్ చేసింది. ఐతే వారం రోజులుగా ఇదే హడావిడి జరుగుతుంది కాబట్టి ఇక ఓపెన్ అవ్వక తప్పదని అమ్మడు చెప్పేసింది. ఐతే పెళ్లిపై మాత్రం ఇంకా అప్డేట్ ఇవ్వలేదు.
ఐతే కీర్తి సురేష్ ఆంటోని (Anthony)ని ప్రేమిస్తుంది.. అతనితో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం అంతకుముందు ఎప్పుడో హింట్ ఇచ్చింది. కీర్తి సురేష్ తన పెట్ ని పరిచయం చేస్తూ నైక్ అని దాన్ని పేరు పెట్టింది. అంటే NYKE అన్నమాట. ఐతే అది ఆటోనీలో చివరి రెండు అక్షరాలు.. Mahanati కీర్తి సురేష్ లో మొదటి రెండు అక్షరాలతో పెట్టిన పేరు. అంటే అది ఆంటోని గిఫ్ట్ గా ఇచ్చింది కాబట్టి దానికి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా అలా ఫిక్స్ చేశారు.
పెట్ పేరు నైక్..
కీర్తి ఆ పెట్ పేరు నైక్ (NYKE) అని పెట్టినప్పుడే ఆమె పీకల్లోతు ప్రేమలో ఉంది కాకపోతే ఆ విషయాన్ని ఇన్నాళ్లు దాచింది. పెట్ పేరుతో కీర్తి సురేష్ ఇచ్చిన హింట్ ని ఇప్పటికి ఆడియన్స్ కనిపెట్టారు. ఏది ఏమైనా కీర్తి సురేష్ సీక్రెట్ లవ్ ఆమె ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చింది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన లవ్ స్టోరీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసుకుంది కీర్తి సురేష్. 15 ఏళ్లుగా ప్రేమ అంటే నిజంగానే అది చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు.
Also Read : Team India: ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ముచ్చట్లు…