Puri Jagannath : స్టార్ హీరోతో పూరీ నెక్స్ట్ మూవీ.. మెంటర్ ఎక్కించేందుకు రెడీనా..!
Puri Jagannath ఆకాష్ పూరీతో చేద్దామని ప్రపోజల్ ఉన్నా కూడా మళ్లీ ఆ ఆలోచన వెనక్కి తీసుకున్నారట. ఐతే పూరీ స్టార్ హీరోకి కథ రాసుకున్నాడట. అతనికి చెప్పడంతో దాదాపు ఓకే చెప్పినట్టు
- By Ramesh Published Date - 09:44 PM, Wed - 6 November 24

ఒకప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) సినిమా వస్తుంది అంటే చాలు రికార్డులను తిరగ రాస్తుంది అని గట్టి నమ్మకంతో ఉండేవారు. అంతేకాదు ప్రతి హీరోకి మైల్ స్టోన్ మూవీ అందిస్తూ వచ్చిన పూరీ ఆ తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయ్యాడు. లైగర్ (Liger), డబుల్ ఇస్మార్ట్ లాంటి ప్రయత్నాలు చేసినా సరే వర్క్ అవుట్ కాలేదు. పూరీకి మరో ఛాన్స్ ఇచ్చే హీరో లేరన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది.
తనయుడు ఆకాష్ పూరీతో చేద్దామని ప్రపోజల్ ఉన్నా కూడా మళ్లీ ఆ ఆలోచన వెనక్కి తీసుకున్నారట. ఐతే పూరీ స్టార్ హీరోకి కథ రాసుకున్నాడట. అతనికి చెప్పడంతో దాదాపు ఓకే చెప్పినట్టు టాక్. ఇంతకీ పూరీకి ఛాన్స్ ఇస్తున్న ఆ స్టార్ హీరో ఎవరంటే మన కింగ్ నాగార్జున అని తెలుస్తుంది.
నాగార్జున పూరీ కాంబోలో శివమణి..
నాగార్జున పూరీ కాంబోలో శివమణి సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఆడియన్స్ ని అలరించింది. మెంటల్ పోలీస్ గా నాగార్జున నటన అదిరిపోయింది. ఐతే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి మళ్లీ శివమణి లాంటి కథతో వస్తారా లేదా మరో కొత్త కాన్సెప్ట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
పూర్తిగా ఫాం కోల్పోయిన పూరీకి నాగార్జున (Nagarjuna) మరో ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్పొచ్చు. మరి పూరీ నాగార్జున సినిమా నిజంగానే ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.
Also Read : Adhitya Ram : ప్రభాస్ సినిమాతో నిర్మాణం ఆపేసి.. చరణ్ సినిమాతో మళ్ళీ తెర మీదకు వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!