Adhitya Ram : ప్రభాస్ సినిమాతో నిర్మాణం ఆపేసి.. చరణ్ సినిమాతో మళ్ళీ తెర మీదకు వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!
Adhitya Ram ఆ సినిమా లాస్ అవ్వడం వల్ల ఆయన నిర్మాతగా సినిమాలు తీయడం ఆపేశారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన ఆ ప్రస్తావన తీసుకు రావడం వల్ల హీరోల ఫ్యాన్స్ మద్య గొడవకు
- By Ramesh Published Date - 09:33 PM, Wed - 6 November 24

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కెరీర్ లో హిట్లు ఫ్లాపులు అనేవి చాలా కామన్. ఐతే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా ఫ్లాప్ సినిమాలు అందించాడు. ఐతే ప్రభాస్ తో సినిమా తీసి ఆ లాసుల వల్ల సినిమాలు వదిలి మళ్లీ చరణ్ సినిమాతో తెర మీదకు వచ్చాడు నిర్మాత ఆదిత్యా రామ్. ప్రభాస్ (Prabhas) తో ఏక్ నిరంజన్ సినిమా చేసిన ఆ నిర్మాత ఆ సినిమా తర్వాత సినిమాలు మానేసి రియల్ ఎస్టేట్ లోకి టర్న్ అయ్యారు.
ఇదే విషయాన్ని ఆయన లేటెస్ట్ గా చెప్పారు. నిర్మాతగా నాలుగైదు సినిమాలు చేసిన తాను ఏక్ నిరంజన్ తర్వాత రియల్ ఎస్టేట్ భూం ఉండటంతో అటు వెళ్లిపోయానని అన్నారు. మళ్లీ ఇప్పుడు చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ సినిమా తమిళ రిలీజ్ హక్కులు పొందానని చెప్పారు. ఐతే ఏక్ నిరంజన్ సినిమా పోవడం వల్లే ఆ నిర్మాత ఇక సినిమాలు ఆపేశాడని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ చరణ్ ఫ్యాన్స్..
ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా నిర్మాత ఆదిత్య రామ్ (Adhitya Ram) కామెంట్స్ వైరల్ అయ్యాయి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన బుజ్జిగాడు సినిమా సక్సెస్ అవ్వగా అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఏక్ నిరంజన్ సినిమా చేశారు.
ఐతే ఆ సినిమా లాస్ అవ్వడం వల్ల ఆయన నిర్మాతగా సినిమాలు తీయడం ఆపేశారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన ఆ ప్రస్తావన తీసుకు రావడం వల్ల హీరోల ఫ్యాన్స్ మద్య గొడవకు దారి తీసినట్టు అయ్యింది.
Also Read : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ టైమ్ ఇచ్చాడా.. హరీష్ శంకర్ సూపర్ హ్యాపీ..!