Nandamuri Family Issue : నందమూరి ఫ్యామిలీ కోల్డ్ వార్ కు పురందేశ్వరి శుభం కార్డు వేయబోతుందా..?
Nandamuri Family Issue : తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ వార్తలను ఖండిస్తూ కుటుంబం అంతా ఒకటేనని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 07:39 PM, Wed - 19 March 25

నందమూరి కుటుంబం (Nandamuri Family) గురించి తరచుగా పలు వార్తలు, గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం చాలాకాలంగా నడుస్తోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరియు జూనియర్ ఎన్టీఆర్(NTR) మధ్య దూరం పెరిగిందన్న వార్తలు హాట్ టాపిక్. అయితే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ వార్తలను ఖండిస్తూ కుటుంబం అంతా ఒకటేనని స్పష్టం చేశారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తనను ఎంతో గౌరవిస్తాడని, కుటుంబ సభ్యులందరితో ప్రతిరోజూ టచ్‌లో ఉంటామని చెప్పారు.
Smita Sabharwal : స్మితా సభర్వాల్‌కు రేపోమాపో నోటీసులు.. కారణం అదే
బాలకృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండగా, అన్ స్టాపబుల్ షోతో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ షోలో స్టార్ హీరోలు చాలా మంది హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనిపించకపోవడం , వీరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించగా, ఎన్టీఆర్ బాలా బాబాయ్ అంటూ అభినందనలు తెలిపారు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా ఒక సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. ఇది కుటుంబ సభ్యుల మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతాలను ఇస్తోంది.
పురందేశ్వరి వ్యాఖ్యలతో నందమూరి కుటుంబంలో విభేదాలపై వస్తున్న ప్రచారానికి ముగింపు పలికినట్లయింది. ఆమె జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో తాను ప్రతిరోజూ మాట్లాడుకుంటానని, వారందరూ కుటుంబ పెద్దలను గౌరవిస్తారని చెప్పడం వల్ల, బయట వ్యక్తమవుతున్న వార్తలలో నిజం లేదని అర్థమవుతోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు మద్దతుగా ఉన్నారని, మీడియా సృష్టించిన అపోహలే ఈ రూమర్లకు కారణమని స్పష్టమవుతోంది. మొత్తంగా నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ ముగిసిందని వారు మళ్లీ ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు లభిస్తున్నాయి.