Bollywood : భర్త పేరును తొలగించింది.. రూమర్స్ కు తెరలేపింది!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి తన భర్త పేరును 'చోప్రా జోనాస్'ని తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- By Balu J Published Date - 11:49 AM, Tue - 23 November 21
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి తన భర్త పేరును ‘చోప్రా జోనాస్’ని తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి అయిన మూడు సంవత్సరాల తర్వాత ప్రియాంక, నిక్ జోనాస్ విడాకులు తీసుకోబోతున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే ఇవన్నీ బోగస్ అని ప్రియాంక స్నేహితుడు మీడియాకు స్పష్టం చేశాడు.
నవంబర్ 22న ప్రియాంక చోప్రా జోనాస్ తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్‌ల నుండి ‘చోప్రా జోనాస్’ని తొలగించింది. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని ఆమె ప్రొఫైల్ ఇప్పుడు కేవలం ప్రియాంక అని మాత్రమే కనబడుతుంది. అయితే విడాకుల కోసం వెళుతున్నారనే పుకార్లు అవాస్తవమని వెల్లడించారు. “ఈ విడాకుల పుకార్లు అన్నీ సరదాగా ఉన్నాయి. ప్రియాంక తన మొదటి పేరును తన భవిష్యత్ ప్రాజెక్టులో ఉపయోగించాలనుకుంటుందట తప్ప, విడిపోతున్నారనే వార్తల్లో నిజం లేదు. ఇదే విషయమై ప్రియాంక స్నేహితురాలు స్పందిస్తూ.. ప్రియాంక ఎప్పుడూ ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తుందని చెప్పింది.
అయితే ప్రియాంక తన ఇంటిపేరును తొలగించిన తర్వాత ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఇంటిపేరును వదులుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా మంది నెటిజన్స్ గందరగోళానికి గురయ్యారు. విపరీతమైన ట్వీట్ చేస్తూ.. ప్రియాంక, ఆమె భర్త నిక్ మధ్య విభేదాలు గురించి మాట్లాడుకోవడం మొదలైంది.
Related News
Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఆ తర్వాత 50 ఏళ్ల వయసులో మరొకసారి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండో పెళ్లి ప్రేమ వివాహం కావడం విశేషం. అంతేకాదు గత ఏడాది రెండో భార్య తేజస్వినితో ఒక బాబుకి కూడా జన్మనించారు. కాగా ఈ ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల దిల్ రాజు పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా మ్యారేజ్ […]