HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Priyamani Bollywood Color Bias Comments

Priyamani : బాలీవుడ్‌లో కలర్ బైయాస్‌పై ప్రియమణి ధీటైన స్పందన

Priyamani : దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ప్రియమణి 2003లో కేవలం 17 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు.

  • Author : Kavya Krishna Date : 10-08-2025 - 4:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyamani
Priyamani

Priyamani : దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ప్రియమణి 2003లో కేవలం 17 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటిస్తూ, తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. స్టార్ హీరోలకు జోడీగా నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ముఖ్యంగా తెలుగులో పెళ్లైన కొత్త, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.

ఇటీవల నారప్ప, భామాకలాపం, విరాట పర్వం వంటి సినిమాల్లో నటించి తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకుంది. హిందీ సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టి, జవాన్, మైదాన్ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. త్వరలోనే తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న జన నాయగన్ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tollywood : మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్‌లో ఇప్పటికీ కలర్ బైయాస్, ప్రాంతీయత వంటి అంశాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని ప్రియమణి ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. “కొంతమంది నన్ను సినిమాల్లో కాస్ట్ చేస్తూ, ‘ఈ క్యారెక్టర్ సౌత్ ఇండియన్ కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం’ అని స్పష్టంగా చెప్పారు. మేం నిజంగానే సౌత్ ఇండియాకు చెందినవాళ్లమే, అనర్గళంగా పలు భాషలు మాట్లాడగలం. నార్త్ యాక్ట్రెస్‌లా తెల్లగా ఉండకపోవచ్చు కానీ అందంగా ఉంటామని ధైర్యంగా చెప్పగలం. చర్మరంగం ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో పాత్రలు ఇస్తూ రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నటీనటుల నైపుణ్యాన్ని చూసే దృష్టి చాలా సార్లు తగ్గిపోతుంది” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రియమణి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అనేక మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఈ విషయంపై తెరపైకి రాబట్టినందుకు అభినందనలు తెలుపుతున్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ను చెస్ ఆటగా వర్ణించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Cinema News
  • Color Bias
  • Jana Nayagan
  • jawan
  • Maidaan
  • priyamani
  • South Indian Actress
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

    Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd