YouTuber Prasad Behara : కమిటీ కుర్రోళ్ళు యాక్టర్ అరెస్ట్
YouTuber Prasad Behara : ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడంటూ (s** harassment case) ఓ హీరోయిన్ ఫిర్యాదు చేయడం అతని అరెస్ట్ చేశారు
- By Sudheer Published Date - 06:18 PM, Wed - 18 December 24

ప్రముఖ యూట్యూబర్ , నటుడు ప్రసాద్ బెహరా(YouTuber Prasad Behara)ను జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills police)అరెస్ట్ (YouTuber Prasad Behara Arrest) చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడంటూ (s** harassment case) ఓ హీరోయిన్ ఫిర్యాదు చేయడం అతని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ‘పెళ్లివారమండి’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ బెహరాతో పరిచయం జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది . అదే సమయంలో ప్రసాద్ తనపై అనుచితంగా ప్రవర్తించాడని, ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను వదిలేయాల్సి వచ్చిందని , ప్రాజెక్ట్‌లో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించినా, ప్రసాద్ వైఖరిని మార్చుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అతనితో మరోసారి ‘మెకానిక్’ వెబ్ సిరీస్‌లో నటించిన సమయంలోనూ బాధితురాలికి ఇబ్బందులు ఎదురయ్యాయి. షూటింగ్ సమయంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనతో తనను చాలా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల యూనిట్ సభ్యుల ఎదుట ప్రసాద్ తనను అవమానించాడని, ప్రశ్నించినప్పుడు తిరిగి బూతులు మాట్లాడాడని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రసాద్ ప్రస్తుతం చిత్రసీమలో మంచి గుర్తింపు పొందుతున్నాడు. ముఖ్యంగా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ లో ఆయన పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించడంతో అతనికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో అతడిపై లైంగిక ఆరోపణలు రావడం , అరెస్ట్ కావడం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Amith Sha Comments : ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డెడ్ లైన్