Dragon Movie Collections: 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్.. మరో రికార్డ్?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగా తాజాగా మరో రికార్డ్ ను సృష్టించింది.
- By Anshu Published Date - 11:02 AM, Mon - 3 March 25

ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా లవ్ టుడే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఊపుతో తాజాగా డ్రాగన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
దీంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే ఏకంగా వందకోట్ల మార్క్ ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్ ను కూడా షేర్ చేశారు. దీంతో అభిమానులు నెటిజన్స్ మూవీ మేకర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇంతకీ ఈ డ్రాగన్ సినిమా కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.. డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్) ఇంటర్ లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్ గా మారిపోయి బీటెక్ లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్ కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్ కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్ లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో, ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్ కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.