Prabhas : నానితో చేయాల్సింది ప్రభాస్ తో చేస్తున్నాడా..?
సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కథ రెడీ చేశానని అన్నారు. హను మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో కూడా నానినే
- By Ramesh Published Date - 02:40 PM, Tue - 20 August 24

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపుడి చేస్తున్న సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియా అంతా స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది. ఈమధ్యనే కల్కి 2898 ఏడితో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రాజా సాబ్ తో రాబోతున్నాడు. ఐతే ఈ క్రమంలోనే సందీప్ రెడ్డితో స్పిరిట్, హను రాఘవపుడితో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. హను తో సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. సినిమాలో హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మాయి గురించి సోషల్ మీడియా అంతా వెతికేస్తున్నారు.
ఇదిలాఉంటే ఈ సినిమా ప్రభాస్ కోసం కాకుండా హను రాఘవపుడి (Hanu Raghavapudi) నానిని దృష్టిలో ఉంచుకుని రాశాడని అంటున్నారు. హను ఇదివరకు ఇంటర్వ్యూలో నాని (Nani)తో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కథ రెడీ చేశానని అన్నారు. హను మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో కూడా నానినే హీరో. త్వరలో ప్రభాస్ తో సినిమా చేసే రేంజ్ కు అతను వెళ్తున్నాడు.
ఐతే నానితో చేయాల్సిన సినిమా ప్రభాస్ కి ఎలా అంటే.. కథ అనుకున్నప్పుడు నాని కోసం అనుకోగా దాన్ని డెవెలప్ చేసే క్రమంలో దీనికి ప్రభాస్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుని ఉండొచ్చు. అలా నాని ప్లేస్ లో ప్రభాస్ వచ్చి ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నాడు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
అతను చేయాల్సిన సినిమా ప్రభాస్ కి వెళ్లిందని తెలిసి నని ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి. ప్రభాస్ ఫౌజి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Puri Jagannath : పూరీకి మళ్లీ ఆ హీరో ఛాన్స్..?