Puri Jagannath : పూరీకి మళ్లీ ఆ హీరో ఛాన్స్..?
బాలయ్య తో ఆల్రెడీ పూరీ పైసా వసూల్ సినిమా చేశాడు. ఆ సినిమా టైం లోనే పూరీ మరో కథ చెప్పడంతో బాలకృష్ణ ఓకే అన్నారట. ఈమధ్య వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న
- By Ramesh Published Date - 02:27 PM, Tue - 20 August 24

Puri Jagannath పూరీ జగన్నాథ్ రీసెంట్ గా రామ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో అదే రిజల్ట్ రిపీట్ చేయలని ఈ కాంబో ఫిక్స్ చేశారు. ఐతే సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. డబుల్ ఇస్మార్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న పూరీ అండ్ రామ్ ఫ్యాన్స్ నిరాశచెందారు. ఐతే ఫ్లాపుల్లో ఉన్న పూరీకి రామ్ లాంటి హీరో ఛాన్స్ ఇచ్చినా దాన్ని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు.
పూరీ నెక్స్ట్ సినిమాకు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే పూరీతో సినిమాకు రెడీ అవుతున్నాడట నందమూరి బాలకృష్ణ. బాలయ్య తో ఆల్రెడీ పూరీ పైసా వసూల్ సినిమా చేశాడు. ఆ సినిమా టైం లోనే పూరీ మరో కథ చెప్పడంతో బాలకృష్ణ ఓకే అన్నారట. ఈమధ్య వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా నెక్స్ట్ బోయపాటి సినిమా లైన్ లో ఉంది.
బోయపాటి శ్రీను సినిమా పూర్తి చేశాక నెక్స్ట్ సినిమా పూరీతో చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే పూరీ చెప్పిన లైన్ కు బాలకృష్ణ (Balakrishna) ఓకే అన్నారని తెలుస్తుంది. పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మరోసారి పైసా వసూల్ కాంబో అదరగొట్టబోతుంది. పూరీ మరి బాలయ్య సినిమాతో అయినా తిరిగి ఫాం లోకి వస్తారేమో చూడాలి.
బాలకృష్ణ మాత్రం సినిమా వెంట సినిమా చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటూ తన స్టామినా చూపిస్తున్నారు. పూరీతో బాలకృష్ణ సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి.
Also Read : Janhvi Kapoor : ఎద అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్