Prabhas Weight: బాహుబలి ‘బరువు’ తగ్గాడు!
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చాలా బరువు పెరిగిన విషయం తెలిసిందే.
- Author : Balu J
Date : 17-06-2022 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చాలా బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆయన సినిమాలు కూడా భారీస్థాయిలో ఉండటంతో బాగా బరువెక్కాడు. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో ఎన్నో ప్రాజెక్టులున్నాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉంది. కేవలం బరువు కారణంగానే ఆ షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ప్రభాస్ తన బరువు పెరగడాన్ని కంట్రోల్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ వారం ప్రభాస్ బక్కపలచని కండలు లుక్ చూసి ఆయన ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. ప్రభాస్ ఆహార ప్రియుడు. రకరకాల ఫుడ్ ను టెస్ట్ చేయడంలో ముందుంటాడు. శరీరంలో కేలరీల శాతం పెరిగి భారీగా బరువు పెరిగిపోయాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. వెంటనే ప్రభాస్ ఫిట్ నెస్ పై ఫోకస్ చేసి దాదాపు 20 నుంచి 22 కిలోలు తగ్గాడు.
King of transformations #Prabhas 👑 pic.twitter.com/covU9LZXdT
— MrsDarling (@Poojitha_Pabsu) June 15, 2022