Prabhas and Trivikram: ప్రభాస్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు
ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు.
- By Praveen Aluthuru Published Date - 04:37 PM, Wed - 24 January 24
Prabhas and Trivikram: ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రభాస్ నటించడం సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేయగా,, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం విమర్శలపాలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టినప్పటికే సెకండ్ వీక్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రభాస్ ఎప్పటినుంచో అసక్తి చూపిస్తున్నాడు, కానీ త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా లేదు. గతంలో ఈ కాంబో గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు సెట్ అవుతుందో క్లారిటీ లేదు. అయితే.. వీరిద్దరి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించాలి అనుకుంది. ఈ సంస్థ త్రివిక్రమ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. అయితే.. త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వడంతో మైత్రీ నుంచి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశారు.
మైత్రీ సంస్థ ప్రభాస్ తో సినిమా కోసం త్రివిక్రమ్ ను మరోసారి కాంటాక్ట్ చేసిందట. ప్రభాస్ తో మైత్రీ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తుంది. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఇది కాకుండా.. త్రివిక్రమ్ తో అయితే.. మరో సినిమా చేస్తానని మైత్రీ సంస్థకు మాట ఇచ్చారట ప్రభాస్. అందుకనే మరోసారి త్రివిక్రమ్ ని కాంటాక్ట్ చేశారట కానీ.. నో చెప్పాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్.. నెక్ట్స్ బన్నీతో సినిమా చేయాలి. ఈ సినిమా కంటే ముందు నానితో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నారు. మరో వైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి, ది రాజాసాబ్ షూటింగ్స్ లో ఉన్నాడు. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాలి. ఆతర్వాత హను రాఘవపూడితో సినిమా చేయాలి. సో.. ప్రభాస్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో..? ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. ప్రభాస్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఆంటే ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: Cracked Lips: పెదవులు పగిలి రక్తం వస్తోందా.. అయితే తేనెతో ఇలా చేయాల్సిందే?
Related News
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..!
Ashu Reddy జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అమ్మడు ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఆమెను వైరల్ అయ్యేలా